ఆదివారం 24 మే 2020
Jangaon - Mar 03, 2020 , 02:51:45

సింథటిక్‌ ట్రాక్‌ పనులు ప్రారంభం

సింథటిక్‌ ట్రాక్‌ పనులు ప్రారంభం

వరంగల్‌స్పోర్ట్స్‌, మార్చి 2 : జేఎన్‌ఎస్‌ క్రీడాప్రాంగణం వేదికగా త్వరలో నిర్మాణం కానున్న సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ పనులను సోమవారం చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర పుటల్లో లిఖించబడిన ఓరుగల్లులో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం జరుగుతుండడం గ్వరంగా ఉందన్నారు. జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభతో అంతర్జాతీయస్థాయిలో జిల్లా క్రీడా ఔనత్యాన్ని పెంపొందించారని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో జరుగనున్న సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం వల్ల చక్కటి క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి యువ క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగురు పరుచుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. డీవైఎస్‌వో ఇందిర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 7 కోట్ల నిధులతో త్వరలోనే పనులు ప్రారంభించి త్వరతిగతిన పూర్తి చేశామని వెల్లడించారు. దేశంలో ప్రఖ్యాతి గాంచిన శివనరేషన్‌ క్రీడా సంస్థ ఈ సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణాన్ని చేపట్టారని, అంతర్జాతీయస్థాయిలో ఈ ట్రాక్‌ పనులు మొదలవుతాయని అన్నారు. కార్యక్రమంలో లైబ్రరీసంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, వివిధ క్రీడాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు. 


logo