బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Mar 03, 2020 , 02:51:45

ఆలయాలకు మకరతోరణాల బహూకరణ

ఆలయాలకు మకరతోరణాల బహూకరణ

దేవరుప్పుల, మార్చి 2: మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జుస్వామి దేవాలయంలో పార్వతీదేవి, వినాయకుడు, బస్టాండ్‌, గ్రామంలోని దుర్గమ్మ తల్లి ఆలయాలకు గ్రామానికి చెందిన సోమసుందర్‌-సూర్యకుమారి దంపతులు ఇత్తడి మకర తోరణాలు చేయించారు. శివాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి తొడుగులు చేయించారు. సోమసుందర్‌ తండ్రి శేషాద్రి- యశోద దంపతుల జ్ఞాపకార్థం రూ. 50 వేలతో వీటిని బహూకరించారు. ఈ మేరకు ఐనవోలు దేవస్థాన వేదపండితులు సదాశివశర్మ, మధుకర్‌ శర్మ, దేవన్న వాటిని శివాలయంలోని పార్వతీ దేవి, గణపతి విగ్రహానికి సోమవారం అంకరించారు. మరో రెండు మకర తోరణాలను దుర్గమ్మ గుళ్లకు  వేద పండితుడు గంగు దీపక్‌ శర్మ అలంకరించారు. భ్రమరాంబ మల్లికార్జుస్వామి దేవాలయంలో సోమసుందర్‌ కుటుంబ సభ్యులు శశిధర్‌- శ్వేత నిశ ప్రత్యేక పూజలు చేశారు. శివాలయ పూజారి పెద్దాపురం వేంకటేశ్వరశర్మ, హనుమాన్‌ దేవాలయ అర్చకుడు ఉప్పల రమేశ్‌శర్మ, దుర్గామాత పూజారులు నర్న సోమశేఖర్‌, బొందుగుల నర్సయ్య, గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ ఈదునూరి నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, రెడ్డి సంఘం అధ్యక్షుడు కాసారపు ధర్మారెడ్డి, సొసైటీ డైరెక్టర్‌ పెద్ది కృష్ణమూర్తి, ఉపసర్పంచ్‌ దశరథ, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు తీగల కొండయ్య, స్థానికులు ఉప్పల్‌రెడ్డి, బూత్కూరు అశోక్‌రెడ్డి, బెలిదె నర్సయ్య, ఆకుల వెంకన్న, ఎల యాదగిరి, రాంరెడ్డి, భిక్షపతి, మల్లేశ్‌, కిష్టయ్య, ఆకుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


logo