శనివారం 28 మార్చి 2020
Jangaon - Feb 27, 2020 , 03:22:32

ఎంజీఎం అభివృద్ధ్దికి రూ.3.28 కోట్లు మంజూరు

ఎంజీఎం అభివృద్ధ్దికి రూ.3.28 కోట్లు మంజూరు

వరంగల్‌ చౌరస్తా, ఫిబ్రవరి 26 : ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పేదలకు వైద్యసేవలు అందిస్తున్న వరంగల్‌ ఎంజీఎం అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్ల 28లక్షల 44 వేల నిధులను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఎంజీఎం అభివృద్ధిపై నాటి కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అందించిన నివేదిక ఆధారంగా ఈ నిధులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు.  రాష్ట్ర వైద్యసేవలు, మౌళిక వసతుల అభివృద్ధ్ది కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ద్వారా ఆధునిక యంత్ర పరికరాల కొనుగోళ్లు చేపట్టి, 100 రోజుల సమయంలో వైద్యసేవలు అందించడానికి వీలుగా ఏర్పాట్లు చేపట్టాలని నివేదించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వం మంజూరు చేసిన  నిధులతో అధునాతన ఎక్స్‌రే మిషన్‌, పిల్లలకు, పెద్దలకు వినియోగించే వెంటిలేటర్‌ యంత్రాలు, మానిటర్లు, అత్యంత అధునాతన సాంకేతికత కలిగిన స్కానింగ్‌ యంత్రం, రక్తనిధి కేంద్రానికి అవసరమైన యంత్ర పరికరాలు, ఆర్ధోపెడిక్‌, జనరల్‌ సర్జరీ, లాప్రోస్కోపీ విభాగాలకు అవసరమైన ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ హెల్త్‌ అండ్‌ ప్యామిలీ వెల్ఫేర్‌ అధికారిని శాంతికుమారి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి పరిపాలన అనుమతులు సైతం మంజూరు చేయడం జరిగినట్లు ఆయన చెప్పారు. ఎంజీఎం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రభుత్వ అనుమతులు అందేలా కృషి చేసిన మంత్రి   దయాకర్‌రావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, వరంగల్‌ తూర్పు , పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, దాస్యం వినయ్‌భాస్కర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.logo