ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 27, 2020 , 03:19:41

పీహెచ్‌సీలను పరిశీలించిన కాయకల్ప ప్రోగ్రాం కమిటీ

పీహెచ్‌సీలను పరిశీలించిన కాయకల్ప ప్రోగ్రాం కమిటీ

కొడకండ్ల, ఫిబ్రవరి 26 : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా ప్రభుత్వ దవాఖానలకు అందజేస్తున్న కాయకల్ప అవార్డుల కమిటీ బృందం బుధవారం మండలం కేంద్రంలోని హిహెచ్‌సీని పరిశీలించారు. దవాఖాన అలంకరణ, పరిశుభ్రత, వృధా ఖర్చుల ఆదా, చెట్ల పెంపకం, రోగులకు చేసిన సేవల వివరాలను అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో రాము మాట్లాడుతూ.. దవాఖాన స్థాయినిబట్టి ప్రభుత్వం అవార్డులను అందచేస్తుందని అన్నారు. 2019-20 సంవత్సరంలో ఎంపికైన పీహెచ్‌సీకి స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా ప్రథమ బహుమతి రూ. 2లక్షలు ప్రోత్సాహక బహుమతి రూ. 50 వేలు ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌  ధన్‌రాజ్‌, ఇన్‌చార్జి శ్రీకాంత్‌, స్థానిక వైద్యులు డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ అనుషారెడ్డి, నర్మెట వైద్యాధికారి డాక్టర్‌ పూర్ణ చందర్‌, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దేవరుప్పుల పీహెచ్‌సీలో.. 

దేవరుప్పుల : దేవరుప్పుల పీహెచ్‌సీని బుధవారం కాయకల్ప ప్రోగ్రాం బృందం పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, అవసరాలు, సౌకర్యాల కల్పనను పరిశీలించి నమోదు చేసుకున్నారు. టీబీ, లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్‌, ఏడీపీహెచ్‌వో ధన్‌రాజ్‌ నేతృత్వంలో డీఐవో రామ్‌నాయక్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ పూర్ణచందర్‌తో కూడిన బృందం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. కాగా ఓపీ, ల్యాబ్‌, ఫార్మసీ,  దవాఖాన పరిసరాలు, పచ్చదనం, వేస్ట్‌ పిట్‌ నిర్వహణ, ఇమ్యూనైజేషన్‌, ఏఎంసీ లాంటివి జరుగుతున్న తీరుపై రిజిష్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి విజయ, సీహెచ్‌వో వెంకటస్వామి, సూపర్‌వైజర్‌ బాబూరావు ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీనాధ్‌, స్టాఫ్‌ నర్స్‌ సంధ్య, ఫార్మసిస్ట్‌ సదానందం తదితరులు ఉన్నారు. 


logo