మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 26, 2020 , 03:26:47

సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

బచ్చన్నపేట : అరవై ఏండ్లు తెలంగాణ సర్వ సంపదను దోచుకున్న ఆంధ్రోళ్ల పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసిన సీఎం కేసీఆర్‌ హయంలోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందుతుందని, అందుకే ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీకే పట్టం కడుతున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం బచ్చన్నపేట మండలంలోని 9 గ్రామాలకు చెందిన 21 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి రూ.21 లక్షల విలువ చేసే చెక్కులకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బచ్చన్నపేట మండలాన్ని నేడు గోదావరి జలాలతో సశ్యశామలం చేశామని, ఇదంతా సీఎం కేసీఆర్‌ చలవే అని అయన అన్నారు. నిండుగా కరంటు, పంటలకు పెట్టుబడి, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. అరవై ఏండ్లు తెలంగాణ సర్వ సంపదను దోచుకున్నారే తప్పా ఆంధ్రోళ్లు ఈ ప్రాంతానికి చేసింది శూన్యమన్నారు. అందుకే ఇక్కడి ప్రజలు పని చేసే కేసీఆర్‌ ప్రభుత్వానికే తమ సంపూర్ణ మద్దతు అని స్వయంగా చేతులెత్తి అంగీకరించడం ఆనందంగా ఉందన్నారు. అంతే కాకుండా ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీకే పైసా తీసుకోకుండా ఓట్లేస్తామని సభలో వెల్లడించడంపై ఆయన వారిని అభినందించారు. డబ్బులకు ఓట్లు అమ్ముకుంటే అభివృద్ధిని ఆకాంక్షించలేమన్నారు. ఎలాంటి నిధులు లేని తెలంగాణను నేడు దేశంలోనే సంక్షేమంలో నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ప్రాజెక్టుల పేర మిందాయే తప్పా రూపాయి పని చేసింది లేదన్నారు. అదే సీఎం కేసీఆర్‌ హయాంలో కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు సృష్టించారని అన్నారు. పల్లె ప్రగతితో ప్రతి ఊరి స్వరూపం మారిపోతుందన్నారు. ప్రజలు సైతం తమ ఊరి కోసం పాటుపడాలన్న ఆలోచనతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పులిగిళ్ల పూర్ణచందర్‌, వైస్‌ చైర్మన్‌ బేజాడి సిద్దులు, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యులు షబ్బీర్‌, ఆర్‌ఐ కృష్ణస్వామి, వీఆర్‌వోలు నాగార్జున, రెహ్మాన్‌, కనకరాజ్‌, ఆంజనేయులు, అంజయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు వెంకట్‌, ఖలీల్‌, మాధవి, పర్శరాములు, రజిత,  కవిత, నాయకులు వేణు, నర్సిరెడ్డి, రాజనర్సు, గుర్రపు బాలరాజు, ఆజీం, విజయభాస్కర్‌, సిద్ధారెడ్డి, కనకయ్య, వెంకట్‌రెడ్డి, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

గోదావరి జలాలతో రెండు పంటలకు సాగునీరు

నర్మెట : నియోజకవర్గంలోని రైతులకు గోదావరి జలాలతో రెండు పంటలకు సాగునీరందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం నర్మెట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, తహసీల్దార్‌ రంగరాయ మురళీధర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే మండలంలోని పలు చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక్కపైసా ఖర్చు లేకుండా రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు, కల్యాణలక్ష్మి వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. అనంతరం నోటుకు ఓటును అమ్ముకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలే తప్పా ఎన్నికల సమయంలో డబ్బుల కోసం ప్రజాప్రతినిధులను ఇబ్బందులు పెట్టకూడదన్నారు. గ్రామాల్లో నాటిన మొక్కలు ఎండిపోతే ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లపై వేటు తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా మచ్చుపహాడ్‌ గ్రామానికి చెందిన బానోత్‌ తుకారాం అనే వ్యక్తి అర్హత ఉన్నా పింఛన్‌ రావడంలేదని ముత్తిరెడ్డికి వివరించగా వెంటనే ఎమ్మెల్యే స్పందించి రెండు మూడు రోజుల్లో అతడికి పింఛన్‌ మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, జెడ్సీటీసీ మాలోత్‌ శ్రీనివాస్‌నాయక్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నక్కల గట్టయ్య, పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పెద్ది రాజిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరటి సుధాకర్‌, ఎంపీటీసీలు కల్యాణం మురళి, ముక్కెర యాదమ్మ, గ్రామాల సర్పంచ్‌లు రామిని శివరాజు, భూక్య శ్రీనివాస్‌, పగడాల నర్సయ్య- విజయ, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ సురేశ్‌, నాయకులు రమేశ్‌, కుంటి రమేశ్‌, పిట్టల రాజు, కొన్నె చంద్రయ్య, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వీఆర్వోలు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>