ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 26, 2020 , 03:26:01

ఓడీసీఎంఎస్‌కు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఓడీసీఎంఎస్‌కు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

మట్టెవాడ, ఫిబ్రవరి 25: ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘం లిమిటెడ్‌(ఓడీసీఎంఎస్‌)కు ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల ప్రక్రియ వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఎదురుగా ఉన్న కల్పలత సూపర్‌ బజార్‌లోని  ఓడీసీఎంఎస్‌ పరిపాలనా కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహం 1గంట వరకు నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 1.30గంటల నుంచి 3గంటల వరకు స్క్రూటినీ, 3.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగినట్లు ఎన్నికల అధికారి కే.ఇందిర, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి సీ.నాగనారాయణ తెలిపారు. ఇందులో ‘ఏ’ కేటగిరిలో ఆరు ఉన్నాయని అందులో రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ-1, ఎస్టీ -1, బీసీ-1, జనరల్‌-3 కేటాయించినట్లు వారు తెలిపారు. ‘బీ’ కేటగిరిలో నాలుగుకుగాను ఎస్సీ-1, బీసీ-1, జనరల్‌-2 రిజర్వ్‌ అయినట్లు వారు తెలిపారు. 

నామినేషన్‌ దాఖలు చేసింది వీరే..

‘ఏ’ కేటగిరిలో ఆరు డైరెక్టర్‌ స్థానాలకు గాను ఐదు మాత్రమే నామినేషన్లు దాఖలు అయ్యాయి. 

ఖానాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామి నాయక్‌(ఎస్టీ) 

కొత్తగూడ మండలం పొగుళ్ల్లపెల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ దేశిడి శ్రీనివాస్‌ రెడ్డి (ఓసీ) 

ఖిలా వరంగల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ కేడెల జనార్దన్‌(బీసీ) 

చెల్పూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ గండ్ర సత్యనారాయణరెడ్డి(ఓసీ),

పరకాల పీఏసీఎస్‌ చైర్మన్‌ అయిన గుండెబోయిన నాగయ్య(ఓసీ) 

‘బీ’ కేటగిరిలో నాలుగు స్థానాలకుగాను రెండు మాత్రమే నామినేషన్స్‌ దాఖలు అయ్యాయి 

కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌(కల్పలత సూపర్‌ బజార్‌) వరంగల్‌ చైర్మన్‌ వర్ధమాన్‌ జనార్దన్‌(బీసీ)

హన్మకొండ సహకార హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ చైర్మన్‌ ఏపూరి శ్రీనివాసరెడ్డి(ఓసీ) 

 కాగా, ఏ, బీ కేటగిరిలలో ఉన్న 10డైరెక్టర్‌ స్థానాలకు గాను 7నామినేషన్‌ దాఖలు అయ్యాయని, వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించామని, అవన్నీ సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇందులో నిర్ణీత సమయంలోపు ఏ అభ్యర్థి కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోలేదని తెలిపారు. దీంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ నెల 29న ఇదే ప్రాంగణంలో సమావేశం నిర్వహించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుందని వివరించారు. అయితే ఖాళీగా ఉన్న డైరెక్టర్‌ స్థానాలను   చైర్మన్‌ ఎన్నిక అనంతరం నామినేట్‌ చేసుకోనున్నట్లు వివరించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఎన్నికల అధికారులు తెలిపారు. 

కాగా, నామినేషన్‌ వేసిన వర్దమాన్‌ జనార్దన్‌, ఏపూరి శ్రీనివాస్‌రెడ్డిలకు మద్దతుగా చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ హాజరై నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఆయనతో పాటు వరంగల్‌ అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు ఉన్నారు. 

పోలీసుల బందోబస్తు

ఓడీసీఎంఎస్‌ ఎన్నికల సందర్భంగా వరంగల్‌ కల్పలత సూపర్‌బజర్‌ వద్ద నిర్వహిస్తున్న నామినేషన్‌ ప్రక్రియకు మట్టెవాడ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బందోబస్తులో మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ టీ.గణేశ్‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ వీ.నరేశ్‌, ఎస్సై మహేందర్‌ 10మంది సిబ్బంది, డిస్ట్రిక్‌ గార్డ్స్‌ పాల్గొన్నారు.  


logo