శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Feb 24, 2020 , 03:05:54

ఓరుగల్లు చైతన్యం గొప్పది

ఓరుగల్లు చైతన్యం గొప్పది

వరంగల్‌,నమస్తేతెలంగాణ/ సుబేదారి/వరంగల్‌ క్రైం: ఏవీవీ ప్లాటినం జూబ్లీ వేడుకల వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం సుబేదారి ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాల మైదానం హెలీప్యాడ్‌ వద్ద ఘన స్వాగతం పలికారు. మంత్రులు మహమూద్‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, సీపీ రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, డిప్యూటీ మేయర్‌ సిరాజుద్దిన్‌, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మందాటి సత్యనారాయణరెడ్డి, మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌, వన్నాల శ్రీరాములు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, రావు పద్మ, వంగాల సమ్మిరెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గుజ్జుల ప్రేమ్‌చందర్‌రెడ్డి, రాజమౌళి, రావులకిషన్‌,చింతాకుల సునీల్‌ ఉపరాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు.  


అందరికీ అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ

మట్టెవాడ:ఏవీవీ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రతి ఒక్కరికీ అభివాదం చేశారు. సమావేశం అనంతరం వీఐపీ, వీవీఐపీ గ్యాలరీ ముందుకొచ్చిన కరచాలనం చేసి పలకరించారు. ముఖ్య నాయకులు ముందువరుసలో ఉండడంతో గ్యాలరీలోని చివరి వరకు వెళ్లి తిరిగి వచ్చి అందరికీ అభివాదం చేస్తూ.. పలకరించారు. 


పర్యటన సాగిందిలా..

ఉదయం 9.45 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వేదిక వద్దకు రాక, 9.50 గంటలకు జాతీయ గీతాలపణ , 10.21కి సావనీర్‌ ఆవిష్కరణ, 10.22కు ప్లాటినం జూబ్లీ రోహిణీ బ్లాక్‌ కు శంకుస్థాపన, 10. 22 నుంచి 11.00 గంటల వరకు ప్రసంగం, 11.02 గంటలకు ఉపరాష్ట్రపతికి  సన్మానం, 11.05 గంటలకు సభాస్థలిలో ఉన్న వారికి అభివాదం, 11.06 గంటలకు  తిరుగుపయనం .


logo