శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 24, 2020 , 03:08:14

వైభవంగా వసంతోత్సవం

వైభవంగా వసంతోత్సవం

పాలకుర్తి, ఫిబ్రవరి 23 : మహా శివరాత్రి  బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం రాత్రి పాలకుర్తి స్వయంభూ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షేరగిరి క్షేతంలో నిర్వహించిన పల్లకి సేవ, పుష్పయాగం, డోలారోహణం, సదస్యము, వసంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి పల్లకి సేవ చేపట్టారు. పలు రకాల పూలతో స్వామివార్లను అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వసంతోత్సవాన్ని తిలకించారు. ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్‌ వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ, ఆలయ కార్యనిర్వణణాధికారి మేకల వీరస్వామి ధర్మకర్తలు కాటబత్తిని రమేశ్‌, పన్నీరు సారంగపాణి, పూజారి మధు, ప్రభాకర్‌రావు,  సోమరాములు, రాంమ్మూర్తి, అర్చకులు దేవగిరి రామన్నశర్మ, లక్ష్మన్నశర్మ, రమేశ్‌శర్మ, అనిల్‌ శర్మ, సునీల్‌, నాగరాజు శర్మ, పాలకుర్తి సంతోశ్‌శర్మ, దేవస్థానం సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, ముంజ రాములు బండారి శ్రీనివాస్‌, భక్తులు తదిరులు పాల్గొన్నారు.


క్షీరగిరికి పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరి క్షేత్రానికి వచ్చిన భక్తులతో ఆలయం పోటెత్తింది. ఆదివారం సెలవు రోజు కావడంతో పలు  ప్రాంతాల నుంచి భక్తులు  సోమేశ్వరస్వామి సన్నిధికి తరలివచ్చారు. ఆలయప్రాంగణం ఎదుట ఉన్న స్థాన ఘట్టాల్లో భక్తులు పుణ్యస్నానాలాచరించి తలనీలాలు సమర్పించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. అనంరం స్వామివారిని దర్శించుకొని శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అలాగే లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షీరగిరి క్షేత్రంపై నెలకొన్న శిఖరం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి పూజలు జరిపి గండ దీపం వెలిగించారు. క్షేత్ర ప్రాంగణంలోని నాగదేవతకు మహిళలు పూజలు నిర్వహించారు. కొండదిగువన ఉన్న ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా దేవస్థాన చైర్మన్‌ వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ, ఆలయకార్యనిర్వహణాధికారి మేకల వీరస్వామి ప్రత్యేక సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు. భక్తుల సౌకర్యార్థం పలు రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సైతం భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.


logo