ఆదివారం 24 మే 2020
Jangaon - Feb 23, 2020 , 03:27:00

‘పల్లెనిద్ర’తో గ్రామ సమస్యల పరిష్కారం

‘పల్లెనిద్ర’తో గ్రామ సమస్యల పరిష్కారం

స్టేషన్‌ఘన్‌ఫూర్‌ నమస్తే తెలంగాణ/ స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం గ్రామాల్లో ఉన్న సమస్యలను వెలికి తీయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమం గ్రా మాల్లో విజయవంతంగా కొనసాగుతున్నది. కార్యక్రమంలో భాగంగా అధికారులు ఆయా సమస్యలను వెలికి తీయాలని ఆర్డీవో రమేశ్‌ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మీదికొండ గ్రామంలో తహసీల్దార్‌ విశ్వప్రసాద్‌, చాగల్లు గ్రామంలో ఈడీ కోర్నెలు, ఏఈవో శశికుమార్‌, ఇప్పగూడెంలో టీ వినయ్‌, తాటికొండలో ఏవో నాగరాజు, విశ్వనాధపురంలో ఏపీఎం కవిత, పాంనూర్‌లో జే ప్రేమయ్య, మండల కేంద్రంలో స్పెషల్‌ అధికారి ఏ నాగరాజు శనివారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు టీ సురేశ్‌కుమార్‌, పోగుల సారంగపాణి, నాగరబోయిన మణెమ్మ, కోతి రేణుక, చల్లా ఉమాసుధీర్‌రెడ్డి, కందుల శ్రీలత, ఈవో పున్నం శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు అశ్విన్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య, కిశోర్‌, వీఆర్‌ఏలు రాము, అశోక్‌, హేమలత, అభి, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.  


జనగామలో..

జనగామ రూరల్‌ : మండలంలోని అన్ని గ్రామా ల్లో అధికారులు పల్లెనిద్ర చేశారు. వడ్లకొండలో ఎంపీడీవో హాసీం, ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌, పెద్దరాంచర్లలోమండల ప్రత్యేక అధికారి, ఇరిగేషన్‌ ఈఈ శంకర్‌రావు, గోపరాజుపల్లిలో తహసీల్దార్‌ రవీందర్‌, గానుగుపహడ్‌లో మండల పశువైద్యుడు బయగాని రవిప్రసాద్‌, ఎల్లంలో ఎంపీవో సంపత్‌, పసరమడ్లలో మండల విస్తరణ అధికారిని వాసవీ, శామీర్‌పేటలో గ్రామ ప్రత్యేక అధికారి అనిల్‌, అన్ని గ్రామాల్లో గ్రామ ప్రత్యేక అధికారులు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలసి సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో  ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 


చిలుపూర్‌లో..

చిలుపూర్‌ : మండల కేంద్రంలో శనివారం రాత్రి అధికారులతో తహసీల్దార్‌ ఎల్‌ రవిచంద్రారెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి వల్ల నేడు గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, శ్మశానవాటికల నిర్మాణం, నర్సరీల నిర్వహణ విధానాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించాలని వివరించారు. ఉదయం 6గంటల నుంచి గ్రామంలోని అన్ని వీధులను అధికారులు పర్యటించి ఎలా ఉన్నాయనే విషయాన్ని గమనించాలని తహసీల్దార్‌ సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనాయక్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అదే విధంగా పల్లగుట్ట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీ సత్యనారాయణ సర్పంచ్‌ మానస సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పల్లె నిద్ర ప్రాధాన్యతను వివరించారు. ఆదివారం ఉదయం గ్రామంలోని అన్ని వీధులను పరిశీలించాలని గ్రామ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులకు కేటాయించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ ఝాన్సీరాణి, ఉపసర్పంచ్‌ బత్తిని శ్రీనుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 


 పాలకుర్తిలో..

పాలకుర్తి : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వివిధశాఖల అధికారులు పల్లె నిద్ర చేపట్టారు. పాలకుర్తిలో తహసీల్దార్‌ ఎన్‌ విజయ్‌భాస్కర్‌, గూడూరులో ఎంపీడీవో అశోక్‌కుమార్‌, ముత్తారంలో నాయబ్‌ తహసీల్దార్‌ బాశేట్టి హరప్రసాద్‌ కోతులాద్‌ ఈరవెన్ను తదితర గ్రామాల్లో ప్రత్యేక  అధికారులు  పల్లె నిద్ర నిర్వహించారు. గూడూరులో నిర్వహించిన గ్రామ సభలో పాలకుర్తి ఎంపీపీ నల్ల నాగిరెడ్డి పాల్గొని మాట్లాడారు.


logo