శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 22, 2020 , 03:32:06

ఓం నమశివాయ

 ఓం నమశివాయ

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌:శివశివ శంకర.. భక్తవ శంకర.. శంభోశివ శంభో.. అంటూ భక్తులు ఆదిదేవుడిని కొలిచారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శివుడికి ప్రీతికరమైన పర్వదినం కావడంతో శుక్రవారం శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. వరంగల్‌ నగరంలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం,  కాశీవిశ్వేశ్వరాలయం, శంభునిగుడి, మడికొండలోని మెట్టురామలింగేశ్వరాలయాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. మరోవైపు వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరాలయం, కురవిలోని వీరభద్రుడి ఆలయం, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయంలో భక్తులు పరమశివుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.      


logo