బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 22, 2020 , 03:26:03

కొమురవెల్లికి స్పెషల్‌ బస్సులు

కొమురవెల్లికి స్పెషల్‌ బస్సులు

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 21 : మహాశివరాత్రి సందర్భంగా జనగామ నుంచి కొమురవెల్లి మధ్య నడిచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం బస్టాండ్‌ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే కొమురవెల్లి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం శివరాత్రి రోజున జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు కొమురవెళ్లికి తరలివచ్చి, మల్లన్న పెద్దపట్నం, స్వామివారి దర్శనం చేసుకున్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసి, బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ ఆవరణాన్ని ఎమ్మెల్యే పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని నియమించాలన్నారు. 


బస్టాండ్‌లో ఔట్‌సోర్సింగ్‌ వాచ్‌మెన్‌ను  నియమించాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్టీసీ డిపో మేనేజర్‌ ధరంసింగ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, జనగామ పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ బండ పద్మ, మున్సిపల్‌ కౌన్సిలర్లు డాక్టర్‌ సుధా సుగుణాకర్‌రాజు, వాంకుడోతు అనిత, అరవింద్‌రెడ్డి, కర్రె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉల్లెంగుల కృష్ణ, భాష్యకార్ల శ్రీనివాస్‌, ఉల్లెంగుల నర్సింగ్‌, సత్యనారాయణ, ఆంజనేయులు, మంగ రామకృష్ణ, ఆర్టీసీ డిపో కార్మిక సంఘాల నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.


జీపీకి ట్రాక్టర్ల పంపిణీ..

స్వచ్ఛభారత్‌ - స్వచ్ఛ తెలంగాణ కింద జనగామ మండలంలోని చౌడారం గ్రామపంచాయతీ కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను శుక్రవారం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గ్రామానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడానికే తెలంగాణ ప్రభుత్వం ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జనగామ పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ ముక్కా రాజయ్య, వార్డు సభ్యులు ఎం వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు డీ రమేశ్‌, ఎం కొమురెల్లి, ఎం వెంకయ్య, ఎం రమేశ్‌, నరహరి పాల్గొన్నారు.logo
>>>>>>