శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 21, 2020 , 03:03:14

మార్చి 31లోగా ఉపాధి రోడ్లు పూర్తి కావాలి

మార్చి 31లోగా ఉపాధి రోడ్లు పూర్తి కావాలి

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లు వచ్చే మార్చి 31నాటికి పూర్తి చే యాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంబంధిత శాఖలను ఆదేశించారు.

  • ఉపాధి హామీ రోడ్లు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తి కావాలి
  • ఉమ్మడి జిల్లా పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ): వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లు వచ్చే మార్చి 31నాటికి పూర్తి చే యాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంబంధిత శాఖలను ఆదేశించారు. అదేవిధంగా చెక్‌డ్యామ్‌ల నిర్మా ణం పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. బుధవారం సాయంత్రం నక్కలగుట్టలోని హరిత-కాకతీయలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన సమీక్షా స మావేశం నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ, జిల్లా మినరల్‌ ఫండ్‌, పీఎంజీఎస్‌వై పథకాల కింద చేపట్టాల్సిన పనులు, వాటి పురోగతిపై సమీక్షించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లెల్లో నిర్మిస్తున్న వైకుంఠదామాలు, నీటిపారుదల శాఖ కింద నిర్మించాల్సిన చెక్‌డ్యామ్‌లపై ఆయన సమీక్షించారు.  ఉ మ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, రో డ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖ రోడ్డు, నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.  సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, ఎం  శ్రీ నివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌ సంబంధితశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సీసీ రోడ్లను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని, ఇందుకోసం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని తెలుసుకొని ముందుకు సాగాలని మంత్రి సూచించారు. logo