శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 20, 2020 , 03:00:50

బ్రహ్మోత్సవాలు షురూ

బ్రహ్మోత్సవాలు షురూ

బచ్చన్నపేట, ఫిబ్రవరి 19: కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయంలో నాలుగు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన పూజారి ఓంనమఃశివాయ ఇంటి నుంచి పూర్ణకుంభంతో పూజలు ప్రారంభించారు. సర్పంచ్‌ గంగం సతీశ్‌రెడ్డి, ఈవో రత్నాకర్‌రెడ్డి, ఎంపీటీసీ నీల శైలజ రమేశ్‌తోపాటు భక్తులు, దాతలు పాల్గొన్నారు. ముందుగా గంగపూజ నిర్వహించి ఆలయ ప్రధాన ద్వారం వద్ద గుమ్మడికాయతో పూజలు చేశారు. అనంతరం పూర్ణకుంభంతో ఆలయంలోకి ప్రవేశించి వేదపండితులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు గంగపూజ, రుత్విక సన్మానం, ఆవాహా దేవతాపూజ, పంచామృత శతరుద్రాభిషేకం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు శతరుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం వంటి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో వెల్లడించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ పులిగిళ్ల పూర్ణచందర్‌, వైస్‌ చైర్మన్‌ బేజాడి సిద్ధులు, పలువురు డైరెక్టర్లు, ఆలయ అర్చకులు సదాశివుడు, మహశివుడు, సంగమేశ్వర్‌, ముక్తేశ్వర్‌, ఆలయ సిబ్బంది చల్లా రాజేందర్‌రెడ్డి, మధు, లక్ష్మికాంత్‌రెడ్డి, యాకమ్మతోపాటు దాతలు మల్లారెడ్డి, నాయకులు నీల రమేశ్‌, యాదగిరి, గంగం బుచ్చిరెడ్డి, ఎల్లయ్య, మండల కోఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చరిత్ర కలిగిన ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. సిద్ధేశ్వరాలయంతో దాత సదాశివరావు సహకారంతో రూ. 20 లక్షలు వెచ్చించి నిర్మించిన శివకల్యాణ మండపాన్ని, దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో ఒకటైన సిద్ధులగుట్టకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. ఏటేటా సిద్ధేశ్వరాలయం అభివృద్ధి చెందుతూ వస్తున్నట్లు చెప్పారు. దాతలు సైతం విరాళాలు అందించేందుకు ముందు కు రావడం అభినందనీయమన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో చేపట్టే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్‌ పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి,  ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు, బచ్చన్నపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ పులిగిళ్ల పూర్ణచందర్‌, వైస్‌ చైర్మన్‌ బేజాడి సిద్ధులు, మండల కో ఆప్షన్‌ సభ్యులు షబ్బీర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు గిరబోయిన అంజయ్య, బావండ్ల కృష్ణంరాజు,  గుర్రపు బాలరాజు, అజీం, భాస్కర్‌ పాల్గొన్నారు.


logo