బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Feb 19, 2020 , 03:58:44

పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 18 : జనగామ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని శివ ఇండస్ట్రీస్‌ కాటన్‌ జిన్నింగ్‌ (పత్తి) మిల్లులో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌ కారణంగా మిల్లులో మంటలు చెలరేగి పత్తి కుప్పలకు అంటుకొని ఆవరణలో నిండిఉన్న పత్తి కుప్పలకు వ్యాపించడంతో సీసీఐతోపాటు ప్రైవేట్‌గా కొనుగోలు చేసిన పత్తి మొత్తం దగ్ధమైంది.

  • విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌తో జనగామలో ఘటన
  • 2 వేల క్వింటాళ్ల మేర పత్తి నిల్వలు
  • రూ. కోటిపైగా ఆస్తి నష్టం
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • కాటన్‌ మిల్లును సందర్శించిన డీసీపీ, ఆర్డీవో

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 18 : జనగామ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని శివ ఇండస్ట్రీస్‌ కాటన్‌ జిన్నింగ్‌ (పత్తి) మిల్లులో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌ కారణంగా మిల్లులో మంటలు చెలరేగి పత్తి కుప్పలకు అంటుకొని ఆవరణలో నిండిఉన్న పత్తి  కుప్పలకు వ్యాపించడంతో సీసీఐతోపాటు ప్రైవేట్‌గా కొనుగోలు చేసిన పత్తి మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు కోటికి పైగా విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వ్యాపారి బుస్సా లింగమూర్తికి చెందిన శివ ఇండస్ట్రీస్‌లో ప్రభుత్వం ఇటీవల సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన నిల్వలు సహా ప్రైవేటుగా మరికొంత పత్తి కూడా నిల్వచేసుకున్నారు. ప్రమాదం జరిగే సమయానికి మిల్లు ఆవరణలో సుమారు 2 వేల క్వింటాళ్ల పత్తి నిల్వ ఉన్నట్లు బాధిత వ్యాపారి చెబుతున్నారు.


విద్యుత్‌ వైర్ల నుంచి మిరుగులు చెలరేగి పత్తి కుప్పలపై పడి అంటుకోవడంతో అక్కడే ఉన్న కూలీలు, రైతులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. క్రమంగా ఆవరణలోని పత్తి కుప్పలన్నీంటికి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అగ్నిమాపక సిబ్బంది పత్తి మిల్లుకు చేరుకొని గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లులో అగ్ని ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, ఆర్డీవో మధుమోహన్‌, అర్బన్‌ సీఐ మల్లేశ్‌ అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 


logo