శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 18, 2020 , 03:27:59

జన నేతకు హరిత కానుక

జన నేతకు హరిత కానుక

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్: తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆరు దశాబ్దాల  ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహానేత కేసీఆర్‌ అని ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. సీమాంధ్ర పాలనలో జరిగిన అన్యాయాన్ని ఎదురించడమేగాక నాటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌తోనే అభివృద్ధి జరుగుతోందని టీఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా  పల్లెల నుంచి పట్టణాల వరకూ మొక్కలు నాటి హరితహారం స్ఫూర్తిని  వివరించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.       


logo