ఆదివారం 24 మే 2020
Jangaon - Feb 18, 2020 , 03:27:13

బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్‌

 బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్‌

రెడ్డికాలనీ: తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్‌ అని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం  టీన్యూస్‌ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నరేందర్‌ హాజరై మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యావత్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పండుగలా జరుపుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శ సీఎంగా పేరు ఘడించారని పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్వీ  ప్రభుత్వానికి, విద్యార్థులకు వారధిగా పని చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో నమస్తేతెలంగాణ బ్యూరో చీఫ్‌ నూర శ్రీనివాస్‌, టీన్యూస్‌ కరస్పాండెంట్‌ ప్రదీప్‌, సిబ్బంది రఘు, సంజీవ్‌, అభిలాష్‌, కేయూ టీఆర్‌ఎస్వీ ఇన్‌చార్జి  జెట్టి రాజేందర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పా లమాకుల కొంరయ్య, నాయకులు విష్ణువర్ధన్‌, కందికొండ తిరుపతి, నాగరాజు, గోపీ, సుభాష్‌, తిరుపతి, సాయి, సుధాకర్‌, అనిల్‌, సృజన్‌, నవీన్‌, శ్రీకాంత్‌, రవి, రాకేశ్‌, ప్రవీణ్‌, సైదులు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.


logo