శనివారం 28 మార్చి 2020
Jangaon - Feb 16, 2020 , 03:38:31

అంతర్‌ బైక్‌ దొంగల అరెస్ట్‌

అంతర్‌  బైక్‌ దొంగల అరెస్ట్‌

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఇండ్ల వద్ద పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలను రాత్రి సమయంలో దొంగిలిస్తున్న నలుగురు దొంగల ముఠాను జనగామ ఠాణా పోలీసులు పట్టుకున్నట్లు వెస్ట్‌జోన్‌ జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌ తెలిపారు. శునివారం జనగామ ఠాణాలో సీఐ మల్లేశ్‌యాదవ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ, ఏసీపీ ద్విచక్రవాహనాల దొంగల వివరాలను వెల్లడించారు.. ఇటీవల కాలంలో జనగామలో ద్విచక్రవాహనాలు చోరీ అవుతున్నాయని తరుచూ ఫిర్యాదులు వస్తున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తూ అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను విచారించారు. వారి వద్ద ఉన్న వాహనాలకు నంబర్‌ ప్లేట్స్‌ లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆ బైకులను దొంగిలించినట్లు పోలీసులు విచాణలో తేల్చారు. వారిద్దరిని పోలీసులు పూర్తి స్థాయిలో విచారించగా నలుగురం ముఠాగా ఏర్పడి ఖరీదైన వాహనాలను దొంగిలించి, అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. ఈ నలుగురిలో ఒకరు మోటర్‌ సైకిల్‌ మెకానిక్‌ పానుగంటి కృష్ణ, ప్రైవేట్‌ డ్రైవర్‌ గూడెపు పృధ్వీరాజ్‌, మరో స్టూడెంట్‌ ఎం అరవింద్‌తో పాటు ఒక బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వీరివద్దనుంచి పోలీసులు రూ.8 లక్షల విలువగల 7 బైక్‌లను స్వాధీనం చేసుకొని ముగ్గురిని జనగామ కోర్టులో హాజరుపర్చామన్నారు. మైనర్‌ను వరంగల్‌ మైహోంకు తరలించినట్లు వెల్లడించారు. సీజ్‌ చేసిన వాహనాల్లో జనగామ ఠాణా, బీబీ నగర్‌పోలీస్‌స్టేషన్‌, భువనగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌, యాదగిరిగుట్ట ఠాణా పరిధిలోని బైక్‌లు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా పొలీసులు ప్రజలకు సూచనలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. సీజ్‌ చేసిన బైక్‌ల నంబర్లు AP28BX5990, KA03 JN 9716, AP24F7805, TS30B2079, TS27B 5658 గల వాహనాలు ఉన్నాయి.


logo