సోమవారం 30 మార్చి 2020
Jangaon - Feb 16, 2020 , 03:37:50

‘సహకారం’లోనూ గూలాబీదే హవా

‘సహకారం’లోనూ గూలాబీదే హవా

స్టేషన్‌ఘన్‌పూర్‌, నమస్తే తెలంగాణ/స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌/జఫర్‌ఘడ్‌/లింగాలఘనపురం: ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే విజయదుంధుబి అన్నట్లుగానే సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే భారీ మెజార్టీతో గెలుపొంది గులాబీ పార్టీ సత్తాచాటిందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శనివారం స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌ఘడ్‌,లింగాలఘనపురం మండలాల్లోని పీఏసీఎస్‌ పరిధిలో జరిగిన సహకార ఎన్నికల సరళిని జెడ్పీచైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలను  సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజయ్య, సంపత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా మందకొడిగా సాగి రైతులు 11 గంటలకు ఆయా పోలింగ్‌ బూతులలో బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికలు ముగిశాయన్నారు.  ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నేడు పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఉన్నందున వారి గెలుపును సీఎం కేసీఆర్‌కు అంకింతం చేసి స్టేషన్‌ఘన్‌ఫూర్‌ మరో ముందడుగు వేయాలని ఆయన కోరారు. కోటి మొక్కలను నాటే లక్ష్యంగా సిద్దమయినట్లు ఆయన తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని పీఏసీఎస్‌ పరిధిలో 61. 34 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ పీఏసీఎస్‌ పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉండగా, మూడు స్థానాలు 2, 6, 13 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 10టీసీలకు ఎన్నికలు జరిగినట్లు ఆయన తెలిపారు. కాగా 8 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు, 5 స్థ్ధానాల్లో కాంగ్రెస్‌ బలపర్చిన టీసీ డైరెక్టర్లుగా గెలిపొందినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అలాగే జఫర్‌ఘడ్‌ సొసైటీ పరిధి లోని 13 స్థానాలకు 9 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవం కావడం అభినందనీయమని, మిగతా మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు లాంఛనమేనని, సీఎం కేసీఆర్‌ను ఐక్యరాజ్య సమితి ప్రశంసిస్తున్నదని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. అలాగే కళ్లెం, లింగాలఘనపురం పీఏసీఎస్‌లను  టీఆర్‌ఎస్‌దే నని ప్రజలూ, రైతులూ రుజువు చేశారన్నారు. మండలంలోని రెండు సొసైటీలో ్ల గులాబీ జెండాను ఎగుర వేసినందుకు రైతులకు, సమన్వయంతో శ్రమించిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కూడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, వైస్‌ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ అక్కనపెల్లి స్వర్ణలత బాలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గట్టు రమేష్‌, సర్పంచ్‌ మండల ఫోరం అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, ఎంపీటీసీలు దయాకర్‌, నర్సింహులు, వెంకటస్వామి, రాజు, స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మునిగాల రాజు, నాయకులు ఇనుగాల నర్సింహారెడ్డి, బంగ్లా శ్రీను, తోట సత్యం, మారెపల్లి ప్రసాద్‌బాబు, గుండె మల్లేశ్‌, రాఘవరెడ్డి, కనకం గణేశ్‌, మాచర్ల రఘురాములు, జైపాల్‌ నాయక్‌,  జఫర్‌ఘడ్‌ ఎంపీపీ సుదర్శన్‌, వైస్‌ ఎంపీపీ కనుకయ్య, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు నీరజారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్లు గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్‌, కర్ణాకర్‌రావు, అబ్దుల్‌ సలామ్‌, సొసైటీ డైరెక్టర్లు, లింగాలఘనపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, ఎన్నికల ఇన్‌చార్జి సేవెల్లి సంపత్‌, నాయకులు వంచ మనోహర్‌రెడ్డి, చిట్ల ఉపేందర్‌రెడ్డి, బస్వగాని శ్రీనివాస్‌గౌడ్‌, ముత్తినేని ఉపేందర్‌ ,గవ్వల మల్లేశం, ఎడ్ల రాజు, రాపోలు శ్రీనివాస్‌, గట్టగల్ల యాదయ్య, కేమిడి కవిత వెంకటేశ్‌, ఉడుగుల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.  


logo