శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Feb 16, 2020 , 03:34:07

కొడకండ్ల శ్రేణుల పనితీరు భేష్‌

కొడకండ్ల శ్రేణుల పనితీరు భేష్‌

కొడకండ్ల : ఎన్నికలేవైనా కొడకండ్ల మండల టీఆర్‌ఎస్‌ శ్రేణుల పనితీరు సమన్వయంతో పనిచేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కితాబిచ్చారు. ఈ సందర్భంగా శనివారం మండలంలో జరుగుతన్న రైతు సేవా సహకార సంఘం ఎన్నికల సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడి రైతు సేవాసహకార సంఘం ఎన్నికల్లో ఏఏ టీసీలు గెలుపొందుతాయనే విషయంపై తెలుసుకున్నారు. మండల అభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుందూరి వెంకటేశ్వర్‌రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్‌ మోహన్‌గాంధీనాయక్‌, మండల రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్‌ వెంకటేశ్వర్‌రావు, పసునూరి మధుసూదన్‌, అమరేందర్‌రెడ్డి, మహేశ్‌నాయక్‌, రాజ్‌కుమర్‌నాయక్‌, అందె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పీఏసీఎస్‌ డైరెక్టర్లు

పాలకుర్తి రూరల్‌ : ఎల్లరాయిని తొర్రూరు పీఏసీఎస్‌ ఎన్నికల్లో 10స్థానాల్లో  ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ డైరెక్టర్లు శనివారం రాత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పర్వతగిరిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ డైరెక్టర్‌గా గెలుపొందడంతో  బాధ్యత పెరిగిందన్నారు. అభివృద్ధికి పాటుపడి, రైతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని, ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, నూతన డైరెక్టర్లు బానోతు రాంధన్‌, ఐలేని నర్సమ్మ, గోనె మైసిరెడ్డి, పసులాది నాగరాజు, ఈర్ల రాజు, ముస్కు కేశవరావు, పులి ప్రభాకర్‌, గాదరి కాంతమ్మ, దామెర ఆంజయ్య, గోనె మైసులు, సంగి పరుశురాములు ఉన్నారు.


logo