శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 15, 2020 , 02:43:19

లక్ష్మీబరాజ్‌లో 14.287 టీఎంసీల నీరు

లక్ష్మీబరాజ్‌లో 14.287 టీఎంసీల నీరు

మహదేవపూర్‌, ఫిబ్రవరి 14: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అంబట్‌పల్లి పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మీబరాజ్‌ సముద్రాన్ని తలపిస్తున్నది. ఎగువ నుంచి క్రమక్రమంగా నీటి ప్రవాహం పెరుగుతూ వస్తుండడంతో లక్ష్మీబరాజ్‌లో నీరు చేరుతున్నది. దీంతో శుక్రవారం నాటికి లక్ష్మీబరాజ్‌లో 14.287 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు సంబంధిత ఇంజినీర్‌ అధికారులు తెలిపారు. లక్ష్మీబరాజ్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు, 100 మీటర్ల ఎత్తు కాగా, మరికొన్ని రోజుల్లో పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా నీటి ప్రవాహం కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు.


logo