సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Feb 14, 2020 , 03:55:27

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

జఫర్‌ఘడ్‌ : జఫర్‌ఘడ్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య గురువారం అన్నారు. సహకార ఎన్నికల సందర్భంగా మండలం లోని తీగారం, తిమ్మంపేట గ్రామాలను ఎమ్మెల్యే రాజయ్య సందర్శించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జఫర్‌ఘడ్‌ సొసైటీ పరిధిలోని 7, 8, 9 టీసీల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన అన్నారు. జఫర్‌ఘడ్‌ సొసైటీ పరిధిలోని 13 టీసీలకు 10 టీసీలు ఏకగ్రీవం కావడం అభినందనీయమని రాజయ్య అన్నారు. మిగతా మూడు టీసీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని రాజయ్య అన్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు సొసైటీలోని సభ్యులను కలిసి ఇంటింటి ప్రచారం చేయాలని రాజయ్య తెలిపారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలను సొసైటీ సభ్యులకు అవగాహన కలిగించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సుదర్శన్‌, వైస్‌ ఎంపీపీ కనకయ్య, జెడ్పీటీసీ ఇల్లందుల బేబి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు నీరజారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్లు గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్‌, కర్ణాకర్‌రావు, అబ్దుల్‌ సలామ్‌, పెద్దిరెడ్డి, ధనుంజయ్‌ పాల్గొన్నారు.

16 నుంచిఛాగల్లులో రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌, నమస్తే తెలంగాణ : మండలంలోని ఛాగల్లు గ్రామంలో ఈనెల 16 నుంచి అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనన్నుట్లు అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు బాస్కుల నాగరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ క్రీడల్లో గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ.20,016, ద్వితీయ బహుమతిగా రూ.10,016 అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రికెట్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే రాజయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జఫర్‌ఘడ్‌ జెడ్పీటీసీ ఇల్లందుల బేబి, వ్యవసాయ మార్కెట్‌ డైరెక్టర్‌ రాఘవరెడ్డి, కార్యదర్శి ఐలపాక శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు దండు నాగరాజు, కోశాధికారి బాస్కుల అనిల్‌, సహాయ కార్యదర్శి బాస్కుల పట్టాభి, ప్రచార కార్యదర్శి చేపూరి రాకేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇనుగాల నరసింహారెడ్డి, తోట సత్యం, కనకం గణేశ్‌, కనకం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


logo