గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 13, 2020 , 04:19:14

కాళేశ్వరానికి జలసాధకుడు

కాళేశ్వరానికి జలసాధకుడు

మహదేవపూర్‌/కాళేశ్వరం/భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 12: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా తీసుకుని చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మరోసారి సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. ముందు గా కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దర్శనం అనంతరం ఆయన గోదావరి నదికి చీర సారెలు సమర్పించ ను న్నారు. కరీంనగర్‌ నుంచి ఉదయం 9 గం.లకు బయలుదేరి ఆయన నేరుగా కాళేశ్వరానికి చేరుకుంటా రు. ఇక్కడ ముఖ్యమంత్రికి దేవస్థానం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. ఇదిలా ఉండగా 2016 మే 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది రాయివేశారు. అనంతరం ఆయన కాళేశ్వరం దేవస్థానానికి రూ.25 కోట్లు నిధులు ప్రకటించారు. రెండోసారి మే 19వ తేదీన 2019లో మరోసారి దర్శించుకుని కాళేశ్వరంను ఒక మోడల్‌ సిటీగా తీర్చిదిద్దాలన్న సకల్పంతో రూ.100 కోట్లు నిధులు ప్రకటించారు. 


ఆ నిధులతోనే ఇప్పుడు కాళేశ్వ రం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకున్నవిధంగా ఇప్పుడిప్పుడే కాళేశ్వరం తుది దశకు చేరుకున్న క్రమంలో ఆయన పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకో బోతుంది. తెలంగాణకే వరప్రదాయనిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు గుండెకాయగా పేరుగాంచిన లక్ష్మీ బరాజ్‌ నిండుకుండగా దర్శనమిస్తుండగా కనులారా వీక్షించడానికి సీఎం వస్తున్నారు. ఇదివరకే మేడిగడ్డ బరాజ్‌ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌ వరకు 19 కిలోమీటర్ల పొడవునా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఎన్నో రికార్డులను తిరగరాస్తూ శరవేగంగా పనులు కొనసాగిన తీరు విదితమే. తెలంగాణ ప్రభు త్వ చిత్తశుద్ది, సీఎం కేసీఆర్‌ పట్టుదల, ఇంజినీరు అధికారుల అంకితభావం వెరసి లక్ష్మీ బరాజ్‌ పనులు యుద్ధప్రాతిపదికన  కొనసాగాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 


2019 జూన్‌ 21న లక్ష్మీ బరాజ్‌ను సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌ల వంటి అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభించారు. ఈ క్రమంలో ఆగస్టు 6వ తేదీన రాగా రెండోసారి గురువారం సీఎం కేసీఆర్‌ సందర్శనకు వస్తున్నారు. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకుని యావత్తు తెలంగాణ రైతాంగానికి మేడిగడ్డ ఫలాలు అందించాలని ఉద్దేశంతో రూ. 2930 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన లక్ష్మీ బరాజ్‌లో 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించగా ఇప్పటి కే సుమారు 14 టీఎంసీల మేర నీటి ప్రవాహం చేరుకోగా మరి కొన్ని రోజుల్లో పూర్తి సామర్థ్యాన్ని చేరుకోనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ లక్ష్మీ బరాజ్‌ను సందర్శించి సంబంధిత ఇరిగేషన్‌ అధికారు లతో దిశానిర్దేశం చేయనున్నారు.



logo