బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 12, 2020 , 02:23:27

గులాబీ జెండా ఎగురవేస్తాం

గులాబీ జెండా ఎగురవేస్తాం

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 11 : వ్యవసాయాన్ని పండుగలా చేసిన టీఆర్‌ఎస్‌కు రైతులు సహకార ఎన్నికల్లో ఓటేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. సహకార సంఘాల ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సహకార ఎన్నికల ఇన్‌చార్జి డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం, బీమా, 24గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, సరిపడా ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు, గోదాంలు నిర్మిస్తూ రైతును రాజుగా చూడాలన్న ధ్యేయంతో ముందుకు పోతున్న టీఆర్‌ఎస్‌కు ఎదురులేని మెజార్టీతో అన్ని చైర్మన్‌ స్థానాలను సీఎంకు కానుక ఇవ్వబోతున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరిగినా ప్రజలు గులాబీపార్టీని ఆదరిస్తున్నారని, ఈసారి జరిగే సహకార ఎన్నికల్లోనూ రైతులు కేసీఆర్‌ పక్షాన నిలువబోతున్నారని, కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలకు మరోసారి భంగపాటు తప్పదన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రైతుబిడ్డ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. పాలనలో తొలి ప్రాధాన్యత అంశంగా వ్యవసాయాన్ని తీసుకొని భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి పట్టాదారుపాసు పుస్తకాలు, 24గంటల కరెంటు, ఎకరానికి ఏడాదికి రూ.10వేల చొప్పున సాగుకు పెట్టుబడి, రూ.5లక్షల రైతుబీమా వంటి వినూత్న కార్యక్రమాలతో అన్నదాతల్లో వెలుగులు నింపారన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో ఒట్టిపోయిన చెరువులు, నెర్రెలుబారిన నేలలు, అడుగంటిన బోరుబావులతో చావలేక, బతుకలేక రైతులు పట్నాలకు వలసలు వెళితే తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ పల్లెల బాట పట్టి సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్న తీరు మీ కళ్లముందే ఉందని అన్నారు. దేశం గర్వపడేలా..ప్రపంచం ఆదర్శంగా తీసుకునేలా రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. సహకార ఎన్నికల్లో రైతులు వ్యవసాయరంగ అభివృద్ధికి ఓటేయాలని.. కేసీఆర్‌ను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతుల పక్షపాతిగా చరిత్ర సృష్టించే పనులు చేసిన కేసీఆర్‌కు సహకార ఎన్నికల్లో పోటీచేస్తున్న గులాబీపార్టీకి చెందిన అన్ని టీసీ డైరెక్టర్‌ స్థానాల్లో గెలిపించి కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట సొసైటీలు ఇప్పటికే ఏకగ్రీవం దిశగా మెజార్టీ డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన నాలుగు సొసైటీలను సైతం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుసకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మండల, గ్రామస్థాయి నాయకులంతా సొసైటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటరుగా ఉన్న ప్రతి రైతును కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు మద్ధతు కోరాలని పిలుపునిచ్చారు. సహకార ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యే వరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అంశంపై రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ భాగ్యలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, సర్పంచుల ఫోరం మంచడల అధ్యక్షురాలు బొల్లం శారదస్వామి, నాయకులు బాల్దె సిద్ధిలింగం, నిమ్మతి మహేందర్‌రెడ్డి, ఏళ్ల సంతోష్‌రెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, గిరబోయిన అం జయ్య, సర్పంచు వడ్డెపల్లి మల్లారెడ్డి, జార్జిరెడ్డి, నక్క సత్తయ్య, శ్రీనివాస్‌, గంగం సతీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి, పసుల ఏబెల్‌, సుధా, గుర్రం బాలరాజు, సిద్ధిరాంరెడ్డి, ఎంపీపీ గోవర్ధన్‌, జెడ్పీటీసీ శ్రీనివాస్‌నాయక్‌, పెద్ది రాజిరెడ్డి, మల్లారెడ్డి, గంగుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo
>>>>>>