శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jangaon - Feb 12, 2020 , 02:21:47

ముత్తిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

ముత్తిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 11 : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 68వ జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. తన వంశీకుల్లో ఒకరు మృతి చెందిన కారణంగా వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనగామలోని క్యాంపు కార్యాలయానికి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అయితే కేక్‌ కటింగ్‌లు, సన్మానాలు, పుష్పగుచ్ఛాలను తిరస్కరించిన ఎమ్మెల్యే పూల కుండీలు, మొక్కలు, చెట్లను స్వీకరించారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సీఎంవో సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా లేఖ పంపారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ముత్తిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నివర్గాల ఆశీస్సులతో రానున్న రోజుల్లో జనగామ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిసినవారిలో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ పోకల జమున లింగయ్య, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు డాక్టర్‌ సుధా సుగుణాకర్‌రాజు, అనిత, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు శారదస్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్దె విజయ సిద్ధిలింగం, బైరగోని యాదగిరిగౌడ్‌, గజ్జెల నర్సిరెడ్డి, కాస భాస్కర్‌, నిమ్మతి మహేందర్‌రెడ్డి, లెనిన్‌, మాశెట్టి వెంకన్న, చంద్రారెడ్డి, గౌస్‌పాషా, జార్జిరెడ్డి, చిన్నం నర్సింహులు, పంతులు ప్రభాకర్‌రావు, కొత్త దిలీప్‌రెడ్డి, గుర్రం భూలక్ష్మి నాగరాజు, సురేందర్‌రెడ్డి, జిట్టె శ్రీశైలం, బక్క లక్ష్మణ్‌, దేవునూరి సతీశ్‌, నారోజు రామేశ్వరాచారి సహా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు ఉన్నారు. logo