బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 11, 2020 , 03:38:28

అగ్రంపహాడ్‌ ఆదాయం రూ.47,52,594

అగ్రంపహాడ్‌ ఆదాయం రూ.47,52,594

సారలమ్మ జాతర హుండీలను సోమవారం ఎండోమెంట్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు లెక్కించారు. వరంగల్‌ బట్టలబజార్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో లెక్కింపు నిర్వహించగా రూ.47,52,594 నగదు, 8 గ్రాముల బంగారం వచ్చిందని ఈవో ధనుంజయశర్మ తెలిపారు. 2018 జాతరలో రూ. 44,28,344 ఆదాయం సమకూరింది. కాగా, విదేశీ కరెన్సీ, ఇతర కానులకను లెక్కించలేదని ఈవో పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమాన్ని పరకాల ఆర్డీవో కిషన్‌, తహసీల్దార్‌ ఎస్‌కే ముంతాజ్‌, ఎండో మెంట్‌ అధికారులు పర్యవేక్షించారు.


logo
>>>>>>