బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 10, 2020 , 03:13:07

జాతర ముగిసినా జన సంద్రమే

జాతర ముగిసినా జన సంద్రమే
  • భారీగా తరలివస్తూ మొక్కులు
  • స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం
  • ఆదివారం ఒక్కరోజే సుమారు నాలుగు లక్షల భక్తులు..
  • ఖాళీ అవుతున్న భక్తుల గుడారాలు

తాడ్వాయి, జనవరి09: నాలుగు రోజులపాటు మహానగరంగా మారిన మేడారం జాతర పరిసరాలు ఖాళీ అవుతున్నాయి. అమ్మవార్ల మహాజాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు దుకా ణాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాల్లోని శివరాంసాగర్‌, జంపన్నవాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్‌, గద్దెలకు చుట్టూ ఉన్న స్థలాల్లో గుడారాలు వేసుకుని వ్యాపారం చేసుకున్నారు. జాతర ముగియ డంతో ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడంతో మేడారం ఖాళీ అవుతోంది. ముందస్తు, జాతర ఐదు రోజులు లక్షలాది మంది వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలతో మేడారం జాతర పరిసరాలు భక్తుల కొనుగోళ్లతో సందడిగా మారాయి. ఈ క్రమంలో జాతర శనివారంతో ముగిసిపోవడంతో భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది. వ్యాపారం తగ్గిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు తమ స్వ గ్రా మాలకు తరలివెళ్తున్నారు. వ్యాపారుల వెళ్లేందుకు తీసుకువచ్చిన వాహనాలతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. దీంతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. వ్యాపారులు తమ గుడారాలను తీసివేస్తుండడంతో రంగురంగుల పాలిథి న్‌ కవర్లతో జాతర పరిసరాలు రంగులమయంగా మారాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతోపాటు వివిధ రకాల వ్యాపారులతో నాలుగు రోజుల పాటు సందడిగా మారిన జాతర పరిసరాలు నిశ్శబ్దంగా మారుతూ మేడారం పాత రూపును సంతరించుకుంటోంది.  


వర్షంతో నష్టపోయిన  వ్యాపారులు 

శుక్రవారం కురిసిన వర్షంతో జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయా రు. వ్యాపారం జరిగే సమయంలో రోజంతా వర్షం కురవడంతో సామగ్రి నీటితో తడిసిపోయింది. అకాల వర్షంతో అతలాకుతలమైన వ్యాపారులు వారి సామగ్రిఇని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిం చలేదు. వర్షం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై చిన్నగా పడింది. రాత్రి 12గంటల సమయంలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. గుడారాల్లోకి వరదనీరు చేరడంతో నీడకోసం అర్ధరాత్రి సమయం లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోటిమంది పైచిలుకు వచ్చే భక్తులతో వ్యాపారం బాగా సాగు తుందని భావించిన వ్యాపారుల ఆశలపై అకాల వర్షం నీటిని చల్లింది. అటు వ్యాపారం సాగక, మిగిలిన సరుకులు నీటిలో తడిచిపోవడంతో తీవ్ర నష్టాలతో వ్యాపారులు స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. గత జాతరలకు భిన్నంగా ఈసారి వర్షం పడడంతో వ్యాపారులు అందోళన చెందారు. జాతర చరిత్రలో ఇప్పటి వరకు తల్లులు వనప్రవేశం చేసిన రోజు వర్షం పడిన దాఖలాలు లేకపోవడంతో వ్యాపారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకదు. 


ప్రతి జాతరలో లాభసాటిగా సాగిన వ్యాపారంఈసారి వరుణుడి దెబ్బకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని వారు పేర్కొన్నారు. కీరదోస, పుచ్చకాయల వ్యాపారం సక్రమంగా సాగలేదు. శీతాకాలం కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఆసక్తి కనబర చకపోవడంతో తెచ్చిన కాయలు అలాగే మిగిలిపోవడంతో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వాటిని ఇంటికి తీసుకువెళ్లేందుకు కిరాయిలు కూడా రావని మేడారం జాతర పరిసరాలలో చౌకగా అమ్మేస్తున్నా రు. బుధవారం నుంచి శుక్రవారం వరకు బ్రాయిలర్‌ కోళ్ల ధరలు ఆకాశాన్నంటినా శనివారం నాటికి జాతర పరిసరాలలోని వివిధ ప్రాంతాల్లో రూ. 50 నుంచి 100కు కోళ్లను విక్రయించారు. వాతావరణం మారిపోవడంతో కోళ్లు మృత్యువాత పడ్డాయి. వేల రూపాయలు వెచ్చించి స్థలాలను లీజుకు తీసుకుని ఏర్పాటు చేయగా పెట్టిన పెట్టుబడిని పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కావడితో కోళ్లను జనసమ్మర్థ ప్రదేశాలకు తరలించి రూ. 50, 100కు విక్రయిస్తున్నారు. 


వరదనీటితో ప్రవహిస్తున్న జంపన్నవాగు 

శనివారం రాత్రి కురిసిన వర్షంతో మేడారంలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం భారీగా కురవడంతో వాగులోకి వరద నీరు చేరుతోంది. దీంతో భక్తులు వాగులో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులు వాగులో నీరు నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఇసుక బస్తాల అడ్డుకట్టలను తొలగించారు. భక్తులు అధికంగా తరలిరావడంతో ప్రమాదాలు జరిగే అవకా శం ఉన్నందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.


logo
>>>>>>