బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 09, 2020 , 02:24:28

దేవతల వన ప్రవేశం

దేవతల వన ప్రవేశం

చిలుపూర్‌ : మహా జాతర ముగిసింది. మూడు రోజులపాటు భక్తులకు దర్శనమిచ్చిన వన దేవతలు శనివారం వన ప్రవేశం చేశారు. చిలుపూర్‌ మండలంలోని లింగంపల్లి సమ్మక్క-సారలమ్మ జాతరలో వనదేవతలు శనివారం వన ప్రవేశం చేశారు. కాగా భక్తులు తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ దేవతలను శనివారం రాత్రి ఆలస్యంగా జనం నుంచి వనంలోకి కోయ పూజారులు తీసుకువెళ్లారు. కోయ పూజారులు మొలుకం నర్సక్క, లక్ష్మయ్య, పిడబోయిన విజయలత ఆధ్వర్యంలో దేవతలను వనంలోకి తీసుకువెళ్లగా వారి వెంట అధికారులు తరలివెళ్లారు. కాగా చివరి రోజున లింగంపల్లి జాతర చైర్మన్‌ మోతె శ్రీనివాస్‌, ఈవో శేషుభారతి దేవతలకు పూల మాలలు వేసి ప్రత్యేక దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా పోలీస్‌ అధికారులు ఏసీపీ మనోహర్‌, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేందర్‌, డీటీ సూర్యనాయక్‌, ఆరోగ్యశాఖ రాంకిషన్‌, మోహన్‌తో పాటు ఆయా శాఖల అధికారులు దేవతలను దర్శించుకున్నారు. 

సమష్టి కృషితో విజయవంతం : ఏసీపీ

చిలుపూర్‌ మండల పరిధిలోని లింగంపల్లి సమ్మక్క-సారలమ్మ జాతర అన్నివర్గాల ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారుల సమష్టి కృషివల్ల జాతర విజయవంతమైందని ఏసీపీ గంధం మనోహర్‌ తెలిపారు. శనివారం ఏసీపీ మనోహర్‌ విలేకరులతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు, సిబ్బంది అన్ని రకాల చర్యలు చేపట్టారని అన్నారు. అదేవిధంగా భక్తులను క్యూ పద్ధతిలో వెళ్లేందుకు, ఇతర కార్యక్రమాలకు స్టేషన్‌ఘన్‌పూర్‌ విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు వలంటీర్లుగా కృషిని అందించారని పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ నుంచి ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలతోపాటు 50 మంది పోలీసు సిబ్బంది జాతరలో విధులను నిర్వర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేందర్‌, డీటీ సూర్యనాయక్‌, జాతర కమిటీ కోఆర్డినేటర్‌ పోలెపల్లి రంజిత్‌రెడ్డి,  జాతర చైర్మన్‌ మోతె శ్రీనివాస్‌, ఈవో శేషుభారతి, సర్పంచ్‌ ఏదునూరి రవీందర్‌, ఎంపీటీసీ కంకటి రవీందర్‌, డైరెక్టర్లు శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌, నమస్తే తెలంగాణ : స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని ఇప్పగూడెం-రంగరాయిగూడెం, తాటికొండ-జిట్టగూడెం గ్రామాల పరిధిలో ఘనంగా కొనసాగిన సమ్మక్క-సారలమ్మ జాతర ముగియడంతో శనివారం కోయ పూజారులు భాషా, నారాయణ, రఘు ఆధ్వర్యంలో దేవతలను వనప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆర్డీవో రమేశ్‌ మాట్లాడుతూ జాతర విజయవంతం కావడానికి కృషిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జాతరలో ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన సీఐలు రాజిరెడ్డి, శ్రీనివాస్‌రావు, ఎస్సైలు రాజ్‌కుమార్‌, రవి, పోలీస్‌ సిబ్బంది మోహన్‌, బాబు, పాషా, పలు శాఖల అధికారులను ఆర్డీవో రమేశ్‌ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌రావు,  సర్పంచ్‌లు అజయ్‌రెడ్డి, అశోక్‌, శిరీష, ఎంపీటీసీలు శైలజ అజయ్‌రెడ్డి, విజయలక్ష్మి, జాతర మాజీ చైర్మన్‌ మందపురం ఎల్లగౌడ్‌, నాయకులు యాకయ్య, రాంనర్సయ్య, మునిగాల రమేశ్‌, ఎంపీవో మహబూబ్‌అలీ, పంచాయతీ కార్యదర్శులు మనోజ్‌, మోహన్‌, క్రాంతి, వీఆర్‌ఏలు రాము, అశోక్‌, అభి, పొలీస్‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>