గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 09, 2020 , 02:20:44

మానవ ప్రగతిలో సైన్స్‌ కీలకం : డీఈవో

మానవ ప్రగతిలో సైన్స్‌ కీలకం : డీఈవో

జనగామ, నమస్తే తెలంగాణ : మానవ ప్రగతిలో సైన్స్‌ పాత్ర కీలకమని  జిల్లా విద్యాశాఖ అధికారి సిగసారపు యాదయ్య అన్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం జనగామలోని సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో జిల్లా సైన్స్‌ అధికారిణి గౌసియాబేగం అధ్యక్షతన ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మానవాళి సుఖ జీవనాన్ని గడుపుతుందన్నారు. ఈ సదస్సులో వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్లు రామచంద్రయ్య, ప్రొఫెసర్‌ లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్‌ కాశీనాథ్‌, టాస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎం రెడ్డి, ఫిజికల్‌ సైన్స్‌ ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలరాజు, లక్ష్మణ్‌జీ, టీవీవీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌, చంద్రశేఖర్‌రావు, నర్సింహారావు, దామోదర్‌రెడ్డి, నరేందర్‌యాదవ్‌, నరేందర్‌, రాజ్‌కుమార్‌, పద్మ సహా 20 మంది ఉపాధ్యాయులు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 

ఉత్తమ ఫలితాలు సాధించాలి

బచ్చన్నపేట  : పదోతరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఓ వేదిక మందిరంలో వాస్విక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఈవో యాదయ్య పాల్గొని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు.   కార్యక్రమంలో పౌండేషన్‌ వ్యవస్థాపకులు నిడిగొండ న రేష్‌కుమార్‌, సభ్యులు శ్రీనివాస్‌, హహేష్‌, భాస్కర్‌రెడ్డి, సదాశివ,లింగేశ్వర్‌,తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>