సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Feb 08, 2020 , 02:36:15

భక్తకోటిని దీవించగా

భక్తకోటిని దీవించగా

భక్తకోటికి వరాలిచ్చేందుకు తల్లులిద్దరు మేడారం గద్దెలపై ఆసీనులయ్యారు. తమను దర్శించుకునేందుకు పిల్లాపాపలతో వస్తున్న వారిని ఆశీర్వదిస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, ఎత్తు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, చీర, సారెను అమ్మవార్లకు సమర్పించారు. ఉదయం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి మేడారంలోనే ఉంటూ జాతరను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం సాయంత్రం తల్లులిద్దరు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. కాగా, అమ్మవార్లను దర్శించుకున్న ప్రజలు ‘వరాలిచ్చే తల్లీ.. ఈ సారికి వెళ్లొస్తాం.. వచ్చే జాతరకు మళ్లొస్తాం’ అంటూ గుండె నిండా భక్తిభావంతో తమ స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు.  నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌


logo