గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 08, 2020 , 02:35:29

జాతరలో సేవలు భేష్‌

జాతరలో సేవలు భేష్‌

మేడారంబృందం, నమస్తేతెలంగాణ: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా శుక్రవారం వరకు లక్ష 44,570మందికి వైద్య సేవలు అందించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అల్లం అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ జాతరలో ఏర్పాటు చేసిన ప్రధాన వైద్యశాలతో పాటు 17 సబ్‌హెల్త్‌ క్యాంపుల ద్వారా భక్తులకు చికిత్స అందించినట్లు తెలిపారు. నిరంతరం 24గంటలు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలను అందించినట్లు తెలిపారు. ఈనెల 3నుంచి శుక్రవారం వరకు సాధారణ వైద్య సేవల నుంచి అత్యవసరమైన వైద్య సేవలను అందించినట్లు తెలిపారు. జాతర సందర్భంగా ప్రధాన వైద్యశాలలో రెండు సుఖప్రసవాలను నిర్వహించి, కేసీఆర్‌ కిట్‌ను అందించడంతో పాటు 1059మందికి ఇన్‌పేషంట్లుగా సేవలు అందించినట్లు తెలిపారు. జాతరలో ఇప్పటి వరకు వివిధ కారణాల ద్వారా జరిగిన ఏడు మరణాలను సైతం నమోదు చేసినట్లు అప్పయ్య వివరించారు.logo
>>>>>>