ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 08, 2020 , 02:33:44

12లక్షల మంది భక్తులకు ఆర్టీసీ సేవలు

12లక్షల మంది భక్తులకు ఆర్టీసీ సేవలు

మేడారం బృందం : మేడారం  మహా జాతరకు 12లక్షల మందికి పైగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ ద్వారా విశేష సేవలందించినట్లు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా జనవరి 29 నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్లు తెలిపా రు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల బస్సుల ద్వారా 12లక్షలకు పైగా భక్తులను మేడారం తరలించినట్లు వివరించారు. సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌, వరంగల్‌ ఆర్‌ఎం శ్రీధర్‌, సమాచార శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డీఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. 


logo