శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 06, 2020 , 03:25:23

సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

పాలకుర్తి రూరల్‌ : త్వరలో జరగనున్న సహకార ఎన్నికల్లో అన్ని డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్దవంగర మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సహకార ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. గోదావరి జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు రైతులను ఓటు అడిగే అర్హత లేదన్నారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులు డీసీసీబీని నిండా ముంచారని మండిపడ్డారు. త్వరలో వారు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ప్రతి పక్షాలు పోటి చేయడానికే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 


పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తిస్తామన్నారు. రైతులకు రుణాలు ఎరువులను సకాలంలో అందించి రైతుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సొసైటీలను బలోపేతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నారాయణరావు, దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నవీన్‌, ఎంపీపీ నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంబాబు, నాయకులు రాఘవరావు, బాలునాయక్‌, రాంచంద్రయ్యశర్మ, మల్లేశం, సుందర్‌రామిరెడ్డి, నర్సింహారెడ్డి, మాధవరావు, ఐలయ్య, వెంకటేశ్వరెడ్డి, రాము, దయాకర్‌, యాకాంతారావు, యాకయ్య, రమేశ్‌, సోమయ్య, ఆంజనేయులు, విజయ్‌పాల్‌రెడ్డి, మదార్‌, నాగన్న, రామోజీ, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.logo