మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 06, 2020 , 03:09:03

జిల్లాను ప్రగతి పథంలో నడిపించండి

జిల్లాను ప్రగతి పథంలో నడిపించండి
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • కలెక్టర్‌కు శుభాకాంక్షలు

జనగామ, నమస్తే తెలంగాణ : జనగామ కలెక్టర్‌ నిఖిలను బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలని కోరారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాంబర్‌లో కొద్దిసేపు ఇద్దరూ సమావేశమై జనగామ జిల్లా ఉద్యమం, ఆవిర్భావం, అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పనులు, నిధులు మంజూరు, పలు పథకాల ప్రగతిపై చర్చించారు. ఈసందర్భంగా ముత్తిరెడి మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్‌ భవనం జనగామకు ఐకాన్‌గా ఉండబోతుందని అన్నారు. కలెక్టర్‌ను కలిసి వా రిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున లింగయ్య, ని యోజకవర్గ టీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ సంపత్‌రెడ్డి, రై తు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ రమణారెడ్డి, ఎంపీపీ కళింగరాజు, జెడ్పీటీసీ దీపిక మహేందర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు గౌస్‌, నర్మెట జెడ్పీటీసీ శ్రీనివాస్‌ నాయక్‌, సర్పంచ్‌ శారద, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.


logo
>>>>>>