మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 02, 2020 , 02:28:45

ఊసేలేని కోచ్‌ ఫ్యాక్టరీ

ఊసేలేని కోచ్‌ ఫ్యాక్టరీ

పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై మిశ్ర మ స్పందన వెలువడుతోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యా క్టరీపై స్పందన లేదని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు భారీ పరిశ్రమల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెలువడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు క ల్పిస్తున్న కేంద్రం ఆదాయపు పన్ను పరిమితిని తగ్గించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలోని చిరుద్యోగులపై పన్నుల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదలు, మధ్యతరగతి వర్గాలను నిరాశపర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.-అర్బన్‌ కలెక్టరేట్‌/రెడ్డికాలనీ/మట్టెవాడ


ప్రజామోద బడ్జెట్‌

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రశంసనీయం. వ్యవసాయ రంగానికి రూ 2.83 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుంది. విద్యకు రూ.99,300 కోట్లు కేటాయించి అన్ని వర్గాలను ఆ దుకునే ప్రయత్నం చేశారు. 

సీఏ త్రిపురనేని గోపిచంద్‌


కాళేశ్వరానికి మొండిచేయి

కాళ్వేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం శోచనీయం. ప్రపంచంలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కనీ సం ప్రస్తావించకపోవడం బాధాకరం. వరంగల్‌ జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్కుకు కూ డా నిధులు కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు నిరాశే మిగిల్చింది. 


మహిళల రక్షణ మరిచారు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళల రక్షణకు నిధులు కేటాయించకపోవడం బాధకరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలపై తీసుకుంటున్న చర్యల్లో పోల్చితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. మహిళాలోకాన్నిమరచి తెచ్చిన బడ్జెట్‌ అమోదయోగ్యంగా లేదు.


ఇన్‌కంటాక్స్‌ పెంపు ఊరట..

ఇన్‌కంటాక్స్‌ పరిధి పెంపు మాత్రమే ఊరట కలిగించింది. ధరల పెరుగుదల కు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు జరుగలేదు. తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తావనే లేదు. అవసరం మేరకు నిధులు కేటాయించలేదు. జాతీయ స్థా యిలో రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ఏర్పా టు వల్ల నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. 


logo
>>>>>>