గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 02, 2020 , 02:23:12

ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

జనగామ టౌన్‌: బైక్‌, ఆటో ఢీకొనగా ఇద్దరికి గాయాలైన ఘటన శనివారం రాత్రి జనగామలో చోటుచేసుకుంది. సీఐ మల్లేశ్‌యాదవ్‌ కథనం ప్రకారం.. పసరమండ్లకు చెందిన రాహుల్‌ జనగామలోని బతుకమ్మకుంటలో తాను చదువుతున్న పాఠశాలకు చెందిన ఓ కార్యక్రమాన్ని ముగించుకుని తల్లిదండ్రులతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట-సూర్యాపేట రోడ్డులోని ఆర్వోబీపై ద్విచక్ర వాహనం ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. సమాచారం అందుకున్న జనగామ ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ మల్లేశ్‌యాదవ్‌ ఘటన స్థలికి చేరుకుని, గాయాలైన ఆటోలోని రాహుల్‌, బైక్‌పై ఉన్న కానిస్టేబుల్‌ పోచయ్యను జిల్లా ప్రధాన దవాఖానకు తరలించినట్లు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.


logo
>>>>>>