శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 01, 2020 , 03:00:45

హోరాహోరీగా..

హోరాహోరీగా..
  • కొనసాగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు
  • ముందంజలో కరీంనగర్‌, ఖమ్మం, జనగామ జట్లు
  • నేటి సాయంత్రం ముగియనున్న పోటీలు
  • హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ టౌన్‌ : జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న 46వ తెలంగాణ బాలబాలికల అంతర్‌జిల్లాల జూనియర్‌ కబడ్డీ క్రీడోత్సవాలు హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన క్రీడోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈక్రీడోత్సవాల్లో జనగామ, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల జట్టు ముందంజలో ఉన్నాయని అసోసియేషన్‌ బాధ్యుడు, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల వివరాలను వెల్లడించారు. 33 జిల్లాల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్నాని, వారికి తొలిరోజు 5 క్రీడా మైదానాలు ఏర్పాటు చేయగా క్రీడలు అలస్యమవుతున్న క్రమంలో శుక్రవారం మరో రెండు మైదానాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. శుక్రవారం వరకు జరిగిన పోటీల్లో 61 మ్యాచ్‌లు జరిగాయని అన్నారు. వీటిలో 31 బాలురు, 30 బాలికుల జట్లకు పోటీలు జరిగాయన్నారు. 


వీటిలో నేడు సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ నిర్వహించి అందులో ఉన్నత ప్రతిభ చూపిన 12 మంది బాలికలు, 12 మంది బాలురను ఎంపిక చేసి హర్యానలో జరిగే జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసేందుకు ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు, నాయకులు ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సారంగపాణి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా డీసీపీ శ్రీనివాసరెడ్డి, సీఐ మల్లేశ్‌యాదవ్‌ క్రీడాకారులను కలిసి కరచాలనం చేసి ఈ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ర్టానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రైల్వే కబడ్డీ కోచ్‌ టీ గట్టయ్య, ఉప్పలయ్య, కుమార్‌, సురేష్‌కుమార్‌, నరేందర్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, కైలాస్‌, వెంకటేశ్వర్లు ఉన్నారు.logo