గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 01, 2020 , 02:56:54

ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్‌

ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్‌
  • లగ్న పత్రికతోనే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలి
  • మిషన్‌ భగీరథ నీళ్లనే తాగాలి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • 340మందికి రూ.34 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

పాలకుర్తి రూరల్‌ : ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని రాష్ట్రపంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం  మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు రూ.34 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీచేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడ పిల్లలకు వరమన్నారు. పేదింటి బిడ్డల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ అని కొనియాడారు. కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కుల పంపిణీలో పాలకుర్తి ప్రథమస్థానంలో ఉందన్నారు. లగ్న ప్రతికతోనే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శ తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. రైతుబంధుతో రూ.10 వేలు పెట్టుబడి అందించిన మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అన్నారు. 


సీఎం కేసీఆర్‌ దయతో గోదావరి జలాలు జిల్లాలో పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 89 గ్రామాల చెరువులు మత్తళ్లు పారుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే రైతులు కరంట్‌ కష్టాలు పడ్డారని గుర్తుచేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించిన మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. మిషన్‌ భగీరథ పేదలకు వరమన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా వస్తున్న స్వచ్ఛమైన నీటినే ప్రజలందరూ తాగాలన్నారు. తాను కూడా అవే నీళ్లను తాగుతున్నానని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్‌ ధరావత్‌ మోహన్‌గాంధీ నాయక్‌, ఆర్డీవో ఎల్‌ రమేశ్‌, తహసీల్దార్‌ ఎన్‌ విజయభాస్కర్‌, ఎంపీడీవో వీ అశోక్‌కుమార్‌, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంకు చైర్మన్‌ అడ్డూరి మాధవరావు, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి జర్పుల బాలునాయక్‌, సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, బొబ్బల అశోక్‌రెడ్డి, కల్వల భాస్కర్‌రెడ్డి, ఇమ్మడి ప్రకాశ్‌, బొమ్మగాని కొంరయ్య, ధరావత్‌ బాలునాయక్‌, మంద కొంరయ్య, మేడిద రజిత, పుస్కూరి పార్వతి, కళింగరావు, బానోత్‌ కాంతి, మంగ భాగ్యమ్మ, లావుడ్య శాంతమ్మ, కత్తి సైదులు, మంద సోమయ్య, కాటబత్తిని రమేశ్‌, చారగొండ్ల శివ, కమ్మగాని రమేశ్‌ పాల్గొన్నారు.


వధూవరులకు మంత్రి ఆశీర్వాదం

మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్‌, బృందావన్‌ గార్డెన్‌లో శుక్రవారం జరిగిన పలు వివాహ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. రెడ్డి గార్డెన్‌లో మండల కేంద్రానికి చెందిన కమ్మగాని కుమారస్వామి-విజయ దంపతుల కుమార్తె రచన-విజయ్‌కుమార్‌, బృందావన్‌ గార్డెన్‌లో గూడూరు గ్రామానికి చెందిన పొన్నం సోమయ్య-శోభ కుమార్తె మౌనిక-రంజిత్‌కుమార్‌ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి వధూవరులకు నూతన వస్ర్తాలను అందజేశారు. ఆయన వెంట మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ సర్వర్‌ఖాన్‌, సర్పంచ్‌లు పుస్కూరి సంపత్‌రావు, రాంకోటి, మోలుగూరి రమేశ్‌, కమ్మగాని నాగన్న, వర్రె వెంకన్న, మూల వెంకన్న, తమ్మి రాంబాబు, అనుముల అంజిరావు, ఏడవెల్లి పురుషోత్తం, మాచర్ల పుల్లయ్య, వడ్లకొండ అండాల్‌, కర్ణాకర్‌రెడ్డి ఉన్నారు.


logo
>>>>>>