మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 01, 2020 , 02:56:01

ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్సీ కడియం

ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్సీ కడియం

జఫర్‌ఘడ్‌ : మండలంలోని రఘునాథపల్లి గ్రామానికి చెందిన మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, మాజీ సర్పంచ్‌ బొమ్మినేని సుకోధర్‌రెడ్డి లివర్‌ వ్యాధితో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బాధితుడు సుకోధర్‌రెడ్డిని కలిసి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7,50,000లు సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌వోసీని అందజేశారు. ఈ సందర్భంగా సుకోధర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్‌, జిల్లా నాయకులు రాజేశ్‌ నాయక్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి ఉన్నారు.

బాధిత కుటుంబాలకు 

ఎమ్మెల్సీ కడియం  పరామర్శ

జఫర్‌ఘడ్‌ : మండలంలోని తిడు గు, వడ్డెగూడెం, తిమ్మాపూర్‌ గ్రామా ల్లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం పరామర్శించారు. తిడుగు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ అంకేశ్వపు సోమ్మయ్య, వడ్డెగూడెం గ్రామానికి చెందిన మంచాల కొమురయ్య, తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన గాదరి మీనమ్మ ఇటీవల పలు కారణాలతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆయా గ్రామాలకు విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమాల్లో రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ బ్రహ్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు రాజేశ్‌ నాయక్‌, మోహన్‌రావు, ఇన్నారెడ్డి, వెంకటస్వామి, అన్నెపు అశోక్‌, నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>