ఆదివారం 24 మే 2020
Jangaon - Feb 01, 2020 , 02:50:35

జాతర పనులను త్వరగా పూర్తి చేయాలి

జాతర పనులను త్వరగా పూర్తి చేయాలి

చిలుపూర్‌ : లింగంపల్లి సమ్మక్క-సారలమ్మ జాతర పెండింగ్‌లో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవో ఎల్‌ రమేశ్‌ ఆదేశించారు. జాతర ప్రాంగణాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు శాఖల అధికారులతో మాట్లాడుతూ.. మంచినీటి సమస్య తలెత్తకుండా అదనపు పైపులైన్లను నిర్మించాలన్నారు. లికేజీ సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు నిరంతర విద్యుత్‌ను అందించాలని సూచించారు. భక్తులు తమ కానుకలను హుండీలో వేసే విధంగా దేవాదాయ శాఖ చూసుకోవాలన్నారు. జాతర ఈవో శేషుభారతి, శ్రీపతిపల్లి-కొండాపూర్‌ జాతరను ఆర్‌డబ్ల్యూఎస్‌ సీఈ విజయప్రకాశ్‌, ఈఈలు రాజేంద్రకుమార్‌, ఎస్‌ఈ కృష్ణయ్య, డీఈ కరణ్‌కుమార్‌ సందర్శించి భక్తులకు తాగునీటి సక్రమంగా అందించాలని అధికారులు చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెండు జాతర్ల చైర్మన్లు మోతె శ్రీనివాస్‌, కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి, సర్పంచ్‌లు కేసిరెడ్డి ప్రత్యుషారెడ్డి, ఏదునూరి రవీందర్‌, లోడెం రజితారవీందర్‌,  ఉపసర్పంచ్‌ కంకటి రాజన్న, ఎంపీటీసీ కంకటి రవీందర్‌, రావులపల్లి వెంకన్న, గాలి ప్రవీణ్‌, అపరాదపు రాజు, రచ్చ రవీందర్‌ పాల్గొన్నారు. 


logo