మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 31, 2020 , 04:54:19

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌
  • అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలు
  • స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామలో కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
  • పంటోత్పత్తులకు గిట్టుబాటు ధర : ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య

స్టేషన్‌ఘన్‌ఫూర్‌ టౌన్‌, జనవరి 30: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పక్షపాతిగా పేరుగడించారని ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం మార్క్‌ఫెడ్‌, ఓడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలోనే రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎంగా కేసీఆర్‌ గుర్తింపు పొందారన్నారు. మార్కెట్‌ అభివృద్ధికి రూ. 3.50 కోట్లతో టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులను చేపడుతామన్నారు. మార్కెట్‌ పరిధిలో మార్క్‌ఫెడ్‌ షెడ్డు, ఓడీసీఎంఎస్‌ షెడ్డు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే రానున్న రోజుల్లో స్టేషన్‌ఘన్‌ఫూర్‌ మార్కెట్‌ను ఉత్తమ మర్కెట్‌గా తీర్చిదిద్దాలని అందుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, జఫర్‌ఘడ్‌ ఎంపీపీ సుదర్శన్‌, జెడ్పీటీసీ బేబి శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ అక్కినపల్లి స్వర్ణలత, వైస్‌ చైర్మన్‌ మాలోత్‌ రమేశ్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, జిల్లా నాయకులు అక్కినపల్లి బాలరాజు, మార్కెట్‌ డైరెక్టర్లు ఎం. రాఘవరెడ్డి, జొన్నల సోమన్న, పాలకుర్తి శ్రీనివాస్‌, ఇస్రం వెంకటయ్య, తోట రజితరమేశ్‌, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం, మార్కెట్‌ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, ఓడీసీఎంఎస్‌ సేల్స్‌ ఆఫీసర్‌ ఐత సంతోశ్‌గుఫ్త, నాయకులు చెరిపల్లి రామల్లు, భాస్కుల యాదగిరి, మారెపల్లి ప్రసాద్‌, గుండె మల్లేశం, మార్కెట్‌ జేఎంఎస్‌ యూసూఫ్‌అలీ, సిబ్బంది టీ శ్రీనివాస్‌, బీ వెంకటేశ్‌, షరీఫ్‌, గుండె రాంచందర్‌, ఎస్‌. లక్ష్మీ, వ్యాపారులు ఎంజ జైహి, గోలి రాజశేఖర్‌ పాల్గొన్నారు. ఉత్తమ మార్కెట్‌ ఉద్యోగిగా అవార్డు పొందిన మార్కెట్‌ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే రాజయ్యను సన్మానించారు. 


వ్యాపారులతో సమీక్ష

కాగా స్టేషన్‌ఘన్‌ఫూర్‌ జీపీ కార్యాలయం సమావేశపు హాల్‌లో గురువారం రోడ్డు వెడల్పు బాధితులు, వ్యాపారులతో సర్పంచ్‌ టీసురేశ్‌కుమార్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ గాంధీ సెంటర్‌ నుంచి రైల్వేగేటు వరకు ఆర్‌అండ్‌బీ పరిధిలో రోడ్డు వెడల్పు చేపట్టనున్నందున ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచిపాలకుర్తి వరకు రోడ్డు వెడల్పుకు రూ. 18 కోట్లు, జఫర్‌ఘడ్‌ వరకు రోడ్డు వెడల్పునకు రూ. 13 కోట్లు, పాంనూర్‌ వరకు రూ. 17 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టామన్నారు. జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌) కింద రూ. 1880 కోట్లతో పనులు జరుగుతుండగా, ఎక్కవ మొత్తంలో స్టేషన్‌ఘన్‌ఫూర్‌ నియోజక వర్గంలోనే రోడ్డు వెడల్పు బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఇందుకు రూ. 1200 కోట్లు ఒక్క స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎన్‌హెచ్‌ పనులు ప్రజల సహకారంతో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 


ప్రస్తుతం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్‌ నుండి రైల్వేగేటు వరకు ఆర్‌అండ్‌బీ పరిధిల ఉందని గతంలోనే 33 ఫీట్లు రోడ్డు వెడల్పుకు జీవో రాగా, అప్పుడు ఎవరు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైన 33 ఫీట్లతో పాటు కాలువల నిర్మాణానికి మరో 5 ఫీట్లు వెనక్కి తగ్గించుకోవాలని, అదనంగా మరో 2 ఫీట్లు వెనక్కి జరిగితే మొత్తం 40 ఫీట్లతో రోడ్డు వెడల్పు పనులు జరుగుతాయన్నారు. ఇందుకు రోడ్డు వెడల్పు బాధితులు, వ్యాపార వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో మేజర్‌ గ్రామాన్ని అభివృద్ధి పరంగా మణితర్నంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ఆయన హమీయిచ్చారు. ఒక వేళ రోడ్డు వెడల్పులో మొత్తానికి ఇళ్లు కోల్పోతే వారి స్ధలంలో ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షల 29 వేలు కేటాయించి కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టుకోడానికి అవకాశం కల్పిస్తామన్నారు.   కాగా శివునిపల్లి ఎస్సీ కాలనీలో గురువారం అనారోగ్యంతో మృతి చెందిన గుర్రం వెంకటయ్య (38) మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. 


 వధూవరులను రాజయ్య ఆశీర్వాదం

మండలకేంద్రంలోని ఈఆర్‌ఎల్‌ గార్డెన్‌లో  గురువారం నీరటి రాజమణి-రమేశ్‌ దంపతుల కూతురు మాధురి-విజయ్‌కుమార్‌ వివాహవిందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జి. రాజు, సింగపురం కిరణ్‌కుమార్‌, జిల్లా నాయకులు గుర్రం యేసుబాబు, మాతంగి దేవయ్య, చింత భరత్‌కుమార్‌, వారు సభ్యులు సింగపురం రమేశ్‌కుమార్‌, ఎస్‌ లక్ష్మీ, సింగపురం కమలాకర్‌, రామల్లు, యాదగిరి పాల్గొన్నారు. 


logo
>>>>>>