సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 31, 2020 , 04:47:29

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బందీగా నిర్వహించాలి
  • జాయింట్‌ కలెక్టర్‌ ఓజేమధు

జనగామ, నమస్తే తెలంగాణ : 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల్లో జరిగే ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాని, ఇందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఓజే మధు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి(డీఐఈవో) జీ శ్రీనివాస్‌, డీఆర్వో మాలతి, ఏసీపీ వినోద్‌కుమార్‌, ఇన్‌చార్జి డీపీఆర్‌వో ప్రేమలత, డీఐసీ సభ్యులు ధర్మేంధ్రతో కలిసి ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల పరిధిలో పోలీస్‌ పెట్రోలింగ్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు ఉండేలా చూడాలన్నారు.


logo