ఆదివారం 24 మే 2020
Jangaon - Jan 30, 2020 , 02:57:55

మంత్రి కేటీఆర్‌ను కలిసిన చైర్‌పర్సన్‌

మంత్రి కేటీఆర్‌ను కలిసిన చైర్‌పర్సన్‌
  • అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన పోకల జమున

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 29 : మంత్రి కేటీఆర్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు సమక్షంలో జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున-లింగయ్య, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌ కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలిసి జ్ఞాపికను అందజేశారు. తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నవ తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జి శంకర్‌ కూడా ఇదే వేదికపై మంత్రి కేటీఆర్‌ను కలిసి, దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట ఫోరం నాయకులు జనార్ధన్‌రెడ్డి, ఎల్లమ్మ, తుపాకుల చంద్రమౌళి, గడ్డం కృష్ణయ్య, చుక్క కుమార్‌, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు. 

కేటీఆర్‌ను కలిసిన జెడ్పీటీసీ  వంశీధర్‌రెడ్డి

లింగాలఘనపురం :  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఎమ్మెల్యే రాజయ్య జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి కలిశారు. బుధవారం మంత్రి నివాసానికి వెళ్లి, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడంతో పుష్పగుచ్ఛం అందజేసి, అభినందనలు తెలిపారు.


logo