సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 29, 2020 , 02:39:17

జీవన ప్రమాణాలు పెంచేందుకే పల్లె ప్రగతి

జీవన ప్రమాణాలు పెంచేందుకే పల్లె ప్రగతి

నర్మెట, జనవరి 28 : గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని ఐఏఫ్‌ఎస్‌ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారి ఆర్‌ఎం డోబ్రియల్‌ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని మచ్చుపహాడ్‌, అమ్మాపురం గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం నర్సరీ, శ్మశానవాటికలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి డంపింగ్‌ యార్డు, వైకుంఠాధామం, నర్సరీ తదితర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలపారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో గ్రామాల ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలన్నారు. నర్సరీ, శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డుల్లో పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధించాలన్నారు. ఖ్యంగా ప్రభుత్వం పారిశుధ్యం, పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అమ్మాపురంలో నర్సరీ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్తూ ప్రజలతో అధికారులతో  మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి, పదిరోజుల్లో వాటిని పరిష్కరించాలని సర్పంచ్‌, కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ ఓజే మధు, డీఆర్డీవో గూడూరి రాంరెడ్డి, డీఎల్పీవో గంగభవాని, జిల్లా ఫారెస్ట్‌ అధికారి రామలింగం, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు, సర్పంచ్‌లు రామిని శివరాజు, కుంటి జగన్‌మ్మోహన్‌, తహసీల్దార్‌ రంగరాజు మురళీధర్‌రావు, ఎంపీడీవో ఎం కృష్ణయ్య,  మండల ప్రత్యేకాధికారి దామోదర్‌రావు, ఏపీఎం రమాదేవి, సొసైటీ డైరెక్టర్‌ సోమ్లా, ఉపసర్పంచ్‌లు కొంపెల్లి రాజు, బైరగోని లక్ష్మయ్యగౌడ్‌, పీఆర్‌ఏఈ శ్రీనివాసులు, కార్యదర్శి నరసింహం, మహిళా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. logo