సోమవారం 30 మార్చి 2020
Jangaon - Jan 28, 2020 , 04:45:25

వనదేవతలకు వందనం

వనదేవతలకు వందనం
  • కిక్కిరిసిన మేడారం జాతర పరిసరాలు
  • తరలివచ్చిన లక్షా50వేల మంది భక్తులు
  • జంపన్నవాగులో పుణ్యస్నానాలు
  • అమ్మవార్లకు భక్తుల ప్రత్యేక పూజలు
  • అమ్మవార్లకు ఎత్తు బెల్లం, పసుపు, కుంకుమ సమర్పణ

తాడ్వాయి విలేకరి: వనదేవతలు కొలువైన మేడారంలోని సమ్మక్క-సారక్కను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం సుమారు లక్షా50 వేల మంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. మహాజాతరకు సమయం సమీపిం చడంతో  మొక్కులు చెల్లించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించు కుంటున్నారు. భక్తుల రాక పెరుగుతుండడంతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. జాతరకు ముందుగానే వ్యాపారాలు జోరుగా సాగుతుండటంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.    


logo