మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 27, 2020 ,

సంపూర్ణంగా ప్లాస్టిక్‌ను నిషేధించాలి

సంపూర్ణంగా ప్లాస్టిక్‌ను నిషేధించాలి

చిలుపూర్‌ : గ్రామాల్లో ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని సర్పంచ్‌ తోకల దివాకర్‌రెడ్డి ప్రజలను కోరారు. ప్లాస్టిక్‌ను నిషేధిస్తామంటూ ఆదివారం పలు గ్రామాల్లో చికెన్‌ సెంటర్ల యజమానులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ చికెన్‌ సెంటర్లలో ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువగా జరుగుతుందని, చికెన్‌ సెంటర్‌ యజమానులు ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. చికెన్‌ సెంటర్ల వచ్చే వారంతా టిఫిన్‌ బాక్స్‌లు వెంట తెచ్చుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొత్త శ్రీకాంత్‌, గ్రామస్తులు శివరాత్రి వీరస్వామి, సాంబారి శివ, మామిడాల రాజమౌళి, వరికొప్పుల గోపాల్‌, తోకల నరేందర్‌రెడ్డి, నిమ్మ రవీందర్‌రెడ్డి, శివరాజ్‌ పాల్గొన్నారు.logo
>>>>>>