బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Jan 27, 2020 ,

132 ట్రిప్పులు నడిచిన ఆర్టీసీ బస్సులు

132 ట్రిప్పులు నడిచిన ఆర్టీసీ బస్సులు

ఏటూరునాగారం,  జనవరి 26 : మేడారం జాతర సమీపిస్తుండడంతో భక్తులు పెద్ద ఎత్తున తల్లుల దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో ఆర్టీసీఅవసరమైన మేరకు బస్సులను నడుపుతోంది. ఆదివారం హైదరాబాద్‌, కొత్తగూడెం, మణుగూరు, తొర్రూరు, మంచిర్యాల, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి 132బస్సు ట్రిప్పులు నడిపినట్లు వరంగల్‌-2డిపో మేనేజర్‌ భానుకిరణ్‌, మేడా రం ఆర్టీసీ కంట్రోలర్‌ ఎల్‌ శంకర్‌ తెలిపారు. 14 వేల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించినట్లు వారు తెలిపారు. ఒక్క హన్మకొండ బస్‌స్టేషన్‌ నుంచే 82 ట్రిప్పులను నడిపినట్లు శంకర్‌ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ప్రస్తుతం గద్దెల సమీపం వరకు నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.  logo