బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 27, 2020 ,

మేడారంలో రెండింతలైన గదుల అద్దెలు

మేడారంలో రెండింతలైన గదుల అద్దెలు

తాడ్వాయి/ఏటూరునాగారం/వాజేడు, జనవరి 26 : మేడారం జాతర సమీపించడంతో మేడారం జాతర పరిసరాల్లోని అద్దె గదులకు రెఅద్దెలు రెట్టింపు చేశారు. భక్తులకు సౌకర్యార్థం అద్దెలకిచ్చేందుకు శాశ్వత, తాత్కాలిక గదులను జాతర పరిసరాల్లో ఏర్పాటు చేశారు. మామూలు సమయంలో రూ.500ల నుంచి రూ.1000వరకు అద్దెగా తీసుకుంటారు. కాగా, గదులకు డిమాండ్‌ పెరగడంతో ఏకంగా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అద్దెను నిర్వాహకులు అమాంతం పెంచేశారు. గత్యంతరం లేకపోవడంతో భక్తులు అడిగినంత ఇచ్చుకుని గదులను అద్దెకు తీసుకుంటున్నారు. అయితే దేవాదాయశాఖకు సరిపడినన్ని గదులు లేకపోవడంతో ప్రైవేట్‌ గదులకు డిమాండ్‌ పెరిగింది. logo
>>>>>>