బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 25, 2020 , 01:57:26

ప్రతి పల్లె శుభ్రంగా ఉండాలె

ప్రతి పల్లె శుభ్రంగా ఉండాలె
  • -అదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం
  • -పచ్చదనం, పారిశుధ్యానికి ప్రాధాన్యత
  • - రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌, పల్లెప్రగతి ఫ్ల్లయింగ్‌స్వాడ్‌ అధికారి వీరబ్రహ్మయ్య
  • - కొన్నె, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటన

బచ్చన్నపేట, జనవరి 24: ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని, అందుకే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి అమలు చేశారని రాష్ట్ర సహకారశాఖ కమీషనర్‌, పల్లెప్రగతి ఫ్ల్లయింగ్‌స్వాడ్‌ అధికారి వీరబ్రహ్మయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కొన్నె, కేశిరెడ్డిపల్లిలో పల్లెప్రగతి పనులను ఆయన పరిశీలించి, అనంతరం నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాధన జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో  కలిసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. నర్సరీ, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల్లో పనులు త్వరగా పూర్తి చేయాలని పూర్తి చేయాలన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు.
 ప్రతీ గ్రామంలో వీధిదీపాలకు ఆన్‌ఆఫ్‌ సౌకర్యం, ఉపాధి కూలీలకు ఉపాధి,  ఎంతమంది వందరోజుల పని చేశారని గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పారిశుధ్యం, పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొన్నెలో యువకుడు అయిన  సర్పంచ్‌ వెంకట్‌గౌడ్‌ పనితీరును ఆయన అభినందించారు. అదే విధంగా కేశిరెడ్డిపల్లిలో పాదయాత్ర ద్వార నర్సరీ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వచ్చి ప్రజలతో, అధికారులతో మాట్లాడారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు,  డీఆర్‌డీవో రాంరెడ్డి,  డీఎల్‌పీవో గంగాభవాని,  ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు,  సర్పంచ్‌ల పోరం అధ్యక్షులు గంగం సతీష్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో వసంత, ఏపీఎం జ్యోతి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నర్సయ్య, ఎంపీవో రఘురామకృష్ణ,  ఈసీ మోహన్‌, సర్పంచ్‌లు వేముల వెంకట్‌గౌడ్‌, ఎంపీటీసీలు మల్గ నర్సమ్మ , కర్ణాల వేణుగోపాల్‌, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సిద్ధేశ్వరాలయంలో పూజలు

మండలంలోని కొడవటూరు గ్రామంలోని సిద్ధేశ్వరస్వామివారికి  శుక్రవారం సహకారశాఖ రాష్ట్ర కమిషనర్‌, పల్లెప్రగతి కార్యక్రమ పరిశీలకుడు వీరబ్రహ్మయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ గంగం సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి ఓంనమఃశివాయ ఆయనకు ఘన స్వాగతం పలికి అర్చనలు, అభిషేకాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఎల్‌పీవో గంగాభవాని, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నర్సయ్య, డిప్యూటీ సీఈవో వసంత, ఏపీఎం జ్యోతి, ఆర్చకులు   సదాశివుడు, మహాశివుడు తదితరులు పాల్గొన్నారు. 

కమిషనర్‌కు సన్మానం

జనగామ రూరల్‌: మండలంలోని పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్త కళల సహకార సంఘం పనితీరును శుక్రవారం రాష్ట్ర సహకార సంఘం కమిషనర్‌ వీరబ్రహ్మయ్య సందర్శించారు. ఈసందర్భంగా సంఘం కార్మికులు తమకు ఈఎస్‌ఐ సౌకర్యం, సబ్సిడీ విద్యుత్‌, రా మేటీరియల్‌, వృద్ధ కళాకారులకు పింఛన్‌ అందించాలని కమిషనర్‌కు మెమోరాండం అందజేశారు. అనంతరం కమిషనర్‌కు మెమెంటో అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రంగు లక్ష్మణాచారి, అయిలా వేదాంతాచారి, సభ్యులు బుచ్చయ్య, నాగభూషణం, ఆంజనేయులు, ఈశ్వరయ్య, వీరన్న, సాంబేశ్వర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. logo
>>>>>>