శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 23, 2020 , 02:05:29

సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు

సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు


లింగాలఘనపురం, జనవరి 22 : ఎక్కడాలేని విధంగా సాహసోపేతంగా పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ రైతులకు దేవుడయ్యాడని స్టేషన్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని నెల్లుట్ల సమీపంలోని పాలకుర్తి క్రాస్ టీఆర్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్ అధ్యక్షతన బుధవారం జరిగిన మండలస్థాయి విస్తృత సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ 24 గంటలు ఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 320 స్థానాల్లో గులాబీ జెండా ఎగురనుందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ నియోజకవర్గానికి కేటీఆర్ ఇన్ బాధ్యత వహించి తనను గెలిపించారన్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంపై కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేస్తున్నారన్నారు. కేటీఆర్ పనితనానికి ఇది నిదర్శనమని, ఎన్నికల తర్వాత కేటీఆర్ ప్రమోషన్ సీఎం పదవీ దక్కనుందన్నారు.

ఎన్నికల రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా లింగాలఘనపురం మండలంలో ఒకే రోజు పల్లెప్రగతి కార్యక్రమంలో 21 గ్రామ పంచాయతీల్లో 21నర్సరీలను ప్రారంభించడం గొప్పవిషయమన్నారు. మండలంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు మూడు ప్రాజెక్ట్ మంజూరయ్యాయని రాజయ్య తెలిపారు. కళ్లెం సమీపంలో 160 ఎకరాల్లో టెక్ట్స్ టైల్ పార్కు, 860 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లెదర్ పార్కు, ఫుడ్ యూనిట్ ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా మరో 2లక్షల మందికి ఉపాధి లభించనుందని వివరించారు. లింగాలఘనపురం, బండ్లగూడెం తదితర చెరువులను గోదావరి జలాలతో నింపడానికి కృషి చేస్తానని రాజయ్య అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ మాట్లాడుతూ.. లింగాలఘనపురం మండలాన్ని రోల్ తీర్చిదిద్దేందుకు అందరు సహకరిచాలని కోరారు.

సమావేశంలో జెడ్పీటీసీలు గుడి వంశీధర్ మారపాక రవి, బేబీ శ్రీనివాస్, ఎంపీపీలు చిట్ల జయశ్రీ,రేఖ, వైస్ కొండబోయిన కిరణ్ నాయకులు గవ్వల మల్లేశం, వంచ మనోహర్ బస్వగాని శ్రీనివాస్ నెల్లుట్ల రవీందర్ ఆకుల కుమార్, దూసరి గణపతి, నామాల బుచ్చయ్య, బోయిని రాజు, దయ్యాల గణేశ్, ధోని, ఒగ్గు రవి, వట్టిపెల్లి సంపత్, లింగాల సింధూ, ఉడుగుల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా బండ్లగూడెం గ్రామం నుంచి వివిధ పార్టీల చెందిన నాయకులు టీఆర్ చేరగా వారికి ఎమ్మెల్యే రాజయ్య గులాబీ కండువాలు కప్పిం ఆహ్వానించారు. అలాగే మండలంలోని నేలపోగుల, కళ్లెం గ్రామాల్లో అనారోగ్యంతో ముగ్గురు మృతి చెందగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే రాజయ్య బుధవారం పరామర్శించారు. నేలపోగులలో నగిర్తి ఈరమ్మ, నోముల నర్సయ్య, కళ్లెంలో గబ్బెట గౌరమ్మ మృతిచెందగా ఆయా కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, జెడ్పీటీసీ గుడి వంశీధర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ నాయకులు దూసరి గణపతి, గుగ్గిళ్ల హరికృష్ణ , ఎంపీటీసీ మార్పు కృష్ణవేణి నాయకులు మార్పు శ్రీనివాస్ రుషిగంపల అంజనేయులు ఉన్నారు.logo