బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Jan 22, 2020 , 04:17:42

రైతును రాజు చేయడమే ధ్యేయం

రైతును రాజు చేయడమే ధ్యేయం
  • - భూ రికార్డుల ప్రక్షాళనతో అన్నదాతలకు మేలు
  • -15 రోజుల్లో ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ
  • -రైతుబీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు
  • -దేశ చరిత్రలో నిలుస్తున్న తెలంగాణ పథకాలు
  • -స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య
స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌ : తెలంగాణలోని రైతులను రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు పాటుపడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌, చిలుపూరు, జఫర్‌ఘడ్‌ మండలాలకు చెందిన రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలో 82 ఏళ్లుగా రెవెన్యూశాఖలో ఏ ప్రక్షాళన చేసిన సందర్భాలు లేవని తెలంగాణ ఆవిర్భవించాక ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారన్నారు. కాగా సుమారు 1100 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందజేసినట్లు చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళనతో రైతులకు ఎంతోమేలు జరిగిందన్నారు. గత ఖరీప్‌ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 5 వేల చొప్పున రూ.6,862 కోట్లను అందించారన్నారు. ఈ రబీ సీజన్‌లో రూ.5, 100 కోట్లు విడుదల చేశారని, ఈ డబ్బులు పది పదిహేను రోజుల్లో రైతుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. రైతు బీమా కింద ఒక్కో రైతుకు రూ. 335 ప్రీమియం చెల్లించే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే రైతుబీమా కింద ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించడం జరుగుతుందన్నారు.

రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరంట్‌, వికలాంగులకు, వితంతువులు, వృద్ధులకు పెంచిన ఆసరా ఫించన్లు అందించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 485 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ చరిత్రలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గంలో 755 మంది రైతులకు ఉచితంగా పట్టాదారు పాస్‌పుస్తకాలతో పాటు, 116 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ కింద 1, 56,85,328 కోట్లను చెక్కుల రూపంలో అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రమేశ్‌, జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, చిలుపూరు ఎంపీపీ సరిత, జఫర్‌ఘడ్‌ ఎంపీపీ సుదర్శన్‌, జఫర్‌ఘడ్‌ జెడ్పీటీసీ బేబి శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, స్టేషన్‌ఘన్‌ఫూర్‌, చిలుపూరు, జఫర్‌ఘడ్‌  తహసీల్దార్లు విశ్వప్రసాద్‌, రవిచంద్రారెడ్డి, ఎంఏ అమీర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగెల రాజు, ఎస్‌. దయాకర్‌తో పాటు నియోజక వర్గంలోని మూడు మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
జఫర్‌ఘడ్‌ : మండలంలోని ఆయా గ్రామాల లబ్ధ్దిదారులైన 197 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, 24 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, ఆయా గ్రామాల సర్పంచ్‌, ఎంపీటీసీ లు, రైతులు, లబ్దిదారులు పాల్గొన్నారు. అలాగే సాగరం గ్రామపంచాయతీకి మంజూరైన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ట్రాక్టర్‌ను సర్పంచ్‌ ప్రవీణ్‌రెడ్డికి అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ కడారి శంకర్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ ఎడ్ల రాజు, టీఆర్‌ఎస్‌ మండలాద్యక్షుడు మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్‌, సాగరం జీపీ సిబ్బంది పాల్గొన్నారు.logo